లోకేష్ పై బాబు నిర్ణ‌య‌మేంట‌ట‌

మ‌హానాడు సంద‌ర్భంగా తిరుప‌తి ప‌ట్ట‌ణంలో ప‌లు చోట్ల లోకేష్‌ని ర‌క‌ర‌కాలుగా చూపిస్తు భారీగా ఫెక్సీలు ఏర్పాటు చేయ‌టం వెనుక కూడా ఆ నేత హ‌స్తం ఉన్న‌ట్టు విన‌వ‌స్తోంది.

దీంతో ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేశ్‌ను మంత్రి వర్గంలోకి తీసుకోవ‌టం ఖాయ‌మ‌న్న ప్రచారం ఊపందుకుంది.

అయితే జిల్లాల‌ వారీగా వైసీపీ కి చెందిన ఎమ్ఎల్ఏల పై విసురుతున్న ఆక‌ర్ష మంత్రం ఫ‌లిస్తున్న త‌రుణంలో స్ధానిక దేశం కేడ‌ర్ నుంచి వ‌స్తున్న వ్య‌తిరేక‌త‌ల‌ను స‌రిదిద్దేందుకు మంత్రులు, సీనియ‌ర్లు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఓ కిలిక్కి రావ‌టం లేదు.దీంతో లోకేష్‌ను రంగంలొకి దింప‌డ‌మే మంచిద‌న్న వాద‌న‌లూ వినిపిస్తున్నాయి.

కానీ లోకేష్‌కు పార్టీలో కీల‌కం చేయాల‌ని, త‌ద్వారా కార్య‌క‌ర్త‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యేందుకు ఆస్కారం ఉంటుంద‌న్న‌ది చంద్ర‌బాబు మ‌న‌సులో మాటగా మ‌రికొంద‌రు చెప్తున్నారు.ఈ నేప‌ధ్యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న త‌న‌యుడు లోకేష్‌కు మంత్రిని చేస్తారో.

లేక పార్టీకే ప‌రిమితం చేస్తారో.మ‌రికొన్ని గంట‌ల్లో తేలిపోనుంది.

Advertisement

తాజా వార్తలు