Chandrababu naidu : ఫైబర్ నెట్ కేసులో ఏ1గా చంద్రబాబు సీఐడీ ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు..!!

ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొలది రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని వరుస కేసులు వెంటాడుతున్నాయి.

లేటెస్ట్ గా ఫైబర్ నెట్ స్కామ్ కేసులో సీఐడీ ఏసీబీ కోర్టు( CID ACB Court )లో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.ఏ1గా టీడీపీ అధినేత చంద్రబాబు, ఏ2గా వేమూరి హరికృష్ణ, ఏ3గా కోగంటి సాంబశివరావును చేర్చింది.తెలుగుదేశం పార్టీ( TDP ) అధినేత చంద్రబాబుని వరుస కేసులు వెంటాడుతున్నాయి.

కొద్దిరోజుల క్రితమే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా మాజీ మంత్రి నారాయణను పేర్కొంటూ CID ఛార్జ్ షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Chandrababu Cid Filed Charge Sheet In Acb Court As A One In Fiber Net Case

గత ఏడాది స్కిల్ స్కామ్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ కావటం జరిగింది.రాజమండ్రి సెంట్రల్ జైలులో 50 రోజులకు పైగా రిమాండ్ ఖైదీగా ఉన్నారు.ఆ తరువాత మధ్యంతర బెయిల్ రావడం జరిగింది.

అనంతరం హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.దీంతో ప్రస్తుతం ఎన్నికలకు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారు.

Advertisement
Chandrababu Cid Filed Charge Sheet In Acb Court As A One In Fiber Net Case-Chan

ఇటువంటి పరిస్థితులలో వరుసగా చంద్రబాబు( Chandrababu )పై కేసులు నమోదు కావడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.సరిగ్గా ఎన్నికలకు ముందు పార్టీ అధినేత పై వరుస కేసులు నమోదు అవుతూ ఉండటంతో.

తెలుగుదేశం నాయకులు టెన్షన్ పడుతూ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు