మోడీ రాకని నల్ల చొక్కాలతో అడ్డుకోండి! చంద్రబాబు పిలుపు!

ఈ రోజు సాయంత్రం ప్రధాని మోడీ విశాఖలో పర్యటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

పర్యటనలో భాగంగా పోలీస్ గ్రౌండ్స్ లో బహిరంగ సభలో కూడా మోడీ పాల్గొంటారు.

ఇదిలా వుంటే ఏపీకి విభజన హామీలు అమలు విషయంలో తెలుగు ప్రజలని మోసం చేసిన ప్రధాని మోడీకి ఏపీలో పర్యటించే అర్హత లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు.అలాగే వైజాగ్ రైల్వే జోన్ ప్రకటించి వాల్తేర్ డివిజన్ లో ఈస్ట్ కోస్ట్ రైల్వే లో చేర్చేసి ఆదాయానికి గండి కొట్టాడని ఆరోపణలు చేస్తున్నారు.

ఇదిలా వుంటే ఈ నేపధ్యంలో వైజాగ్ లో మోడీ పర్యటనని అడ్డుకోవాలని నిరసనలతో అతనికి స్వాగతం పలకాలని, తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ నల్ల చొక్కా ధరించి మోడీకి తమ నిరసన తెలియజేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.విశాఖలో మోడీ పర్యటన వెనుక కుట్ర దాగి వుందని, దానిని ప్రజల ముందుకి తీసుకొచ్చే విధంగా ధర్మ పోరాట నిరసనలు తెలియజేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Advertisement