నిహారిక బర్త్ డేకు చైతన్య గిఫ్ట్ ఏం ఇచ్చాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నిహారిక తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉంటుంది.

పెళ్లి అయినప్పటికీ అదే జోష్ తో ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది నిహారిక.ఈ క్రమంలోనే తన భర్తతో కలిసి వెకేషన్ లు తిరుగుతూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ వస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా నిహారిక తన 29వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంది.నిహారిక పుట్టినరోజు వేడుకను మెగా హీరోలు ఘనంగా నిర్వహించారు.

ఈ క్రమంలోనే మెగా అభిమానులు సైతం నిహారికకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు.ఇది ఇలా ఉంటే నిహారిక జొన్నలగడ్డ చైతన్య పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

భార్య నిహారిక బర్తడే పుట్టినరోజు సందర్భంగా ఒక అరుదైన బహుమతిని అందించారు చైతన్య.నిహారిక పేరు మీద రెండు ఏనుగులను దత్తత తీసుకున్నాడు.

ఇకపై ఆ రెండు ఏనుగుల సంరక్షణ మొత్తం ఈ జంట చూసుకోనుంది.అందుకు సంబంధించిన వీడియోని నిహారిక తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తూ ఎంతో ఆనందపడింది.

నిహారిక షేర్ చేసిన ఆ వీడియోలో ఒక తల్లి ఏనుగు పిల్ల ఏనుగు పరిగెత్తుకుంటూ నిహారిక దగ్గరకు వస్తున్నాయి.

ఆ వీడియోని షేర్ చేస్తూ దాని కింద నా హ్యాపీ బర్త్డే నిహా అని ఫ్లవర్స్ పెట్టి బర్త్డే విషెస్ ను తెలిపాడు చైతన్య.అందుకు సంబంధించిన వీడియోని నిహారిక షేర్ చేస్తూ నేను లేక పోతున్నాను థాంక్స్ చై ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు అని రాసుకొచ్చింది.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..

కాగా మెగా అభిమానులు నిహారికకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు