ఢిల్లీ వాయు కాలుష్యంపై కేంద్రం అప్రమత్తం

ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతుండటంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.ఈ మేరకు కాలుష్యంపై ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలను హెచ్చరించింది.

ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాల కార్యదర్శులకు లేఖలు రాసింది.

అయితే దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతుంది.దీంతో ప్రజలు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కాగా కాలుష్యాన్ని తగ్గించేందుకు కృత్రిమ వర్షాలకు సిద్ధమైన తరుణంలో వాతావరణం అనుకూలించి వర్షాలు కురుస్తున్నాయి.దీంతో కాలుష్యం నుంచి కాస్త ఉపశమనం లభించిందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు