మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని విచారించిన సిబిఐ..

నెల్లూరు జిల్లా న్యాయ వ్యవస్థను ఉలిక్కి పడేలా చేసిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసుకు సంబంధించిన ఫైళ్లు కోర్టులో తస్కరించబడ్డాయి.

జిల్లా కోర్టులో ఫైళ్లు తస్కరణ కేసు సిబిఐ విచారణ చేపడుతుంది.

ఇదే కేసుకు సంబంధించి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని సిబిఐ అధికారులు విచారణ చేపట్టారు.విచారణ అనంతరం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాత్రికేయలతో మాట్లాడారు.

నా కుటుంబం పై నిందలు వేస్తూ నాలుగు దేశాలలో నాకు నా కుటుంబానికి ఆస్తులు ఉన్నట్లు గతంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపణలు చేశారు.చెన్నై నుంచి వచ్చిన సిబిఐ ఎస్పి నిర్మలాదేవి, అడిషనల్ ఎస్పీ ఆనంద్ కృష్ణన్ నన్ను విచారణ చేశారని తెలియజేశారు.

నకిలీ డాక్యుమెంట్ల ముఠాతో సంబంధాలు ఉన్న కాకాణి పై పూర్తి వివరాలను సిబిఐ కి తెలియజేశానన్నారు.సోమ మంగళ వారలలో మళ్లీ పిలిపించి లిఖితపూర్వకంగా నా స్టేట్మెంట్ తీసుకుంటామన్నారు .సుమారు 15 నుండి 20వేల ఫైల్లు ఉన్న జిల్లా కోర్టు రిజిస్టర్ రూమ్ నుండి కాకాణి ఫైల్ ఒక్కటే అపహరణకు గురి అయినటువంటి అంశాన్ని సిపిఐ వారికి వివరించానన్నారు.జిల్లా కోర్టులో అపహరణ జరిగితే పోలీస్ వ్యవస్థ క్లూస్ టీం,డాగ్స్వర్డ్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోలేదని సాక్షాత్తు జిల్లా జడ్జి నివేదిక ఇవ్వడంపై పోలీస్ వ్యవస్థ సిగ్గుతో తలవంచుకోవాలన్నారు.

Advertisement

నకిలీ మద్యం కేసులో బెయిల్ అడ్డం పెట్టుకొని జైలు తప్పించుకున్న వ్యక్తి కాకాణి అని విమర్శించారు .సిబిఐ ఎంక్వైరీ పై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆశాభవం వ్యక్తం చేశారు.

అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట
Advertisement

తాజా వార్తలు