అయ్యో బాబు ... ఓటుకు నోటు అస్త్రం వదలబోతున్నకేసీఆర్

రాజకీయ నాయకుల మనస్తత్వాలు ఒక పట్టాన ఎవరికీ అర్ధం కావు.వారు ఎవరితో మితృత్వం పెట్టుకున్నా.

ఎవరితో శత్రుత్వం పెట్టుకున్నా .అది రాజకీయ అవసరాలమేరకే ఉంటుంది.బుజం బుజం రాసుకుని తిరిగిన నేతలు అవసరమయితే ఆ బుజం తెగ్గొట్టడానికి కూడా వెనకాడరు.

రాజకీయాలు అంటేనే ఇలా ఉంటాయి.అవును రాజకీయాలు అంటే ఇలాగే ఉండాలి.

లేకపోతే కష్టం అన్నట్టు ప్రస్తుత పరిస్థితి ఉంది.ఇక విషయానికి వస్తే.

Advertisement

తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ మొన్నటివరకు స్తబ్దుగా ఉంది.ఉనికే కష్టం అన్నట్టు మారిపోయింది.

అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ తో పొత్తు పెట్టుకుని మళ్లీ బలపడాలని చూస్తోంది టీడీపీ.అయితే ఈ పరిణామం టీఆరఎస్ అధినేత కేసీఆర్ కి ఆగ్రహం తెప్పిస్తోంది.

అందుకే ఇప్పుడు కేసీఆర్ తన అస్త్రాలను పదును పెడుతున్నారు.ఆయన గత కొన్ని రోజులుగా ముందస్తు ఎన్నికలకు వ్యూహాలను రచిస్తూ.పార్టీని ఎన్నికల వైపుగా నడిపిస్తున్నారు.

కొన్ని రాజకీయ పార్టీలను తన అదుపులో ఉంచుకోవడానికి.పాత కేసులను తవ్వి తీస్తున్నారు.

తెలంగాణలో తాను ఎంత అణిచివేసినా.మళ్లీ పుట్టుకొస్తున్న తెలుగుదేశం పార్టీ వల్ల తనకు ఇబ్బంది అవుతుందని భావిస్తోన్న ఆయన టిడిపి అధినేత చంద్రబాబుపై ఉన్న ఓటుకు నోటు కేసును మళ్లీ బయటకు తెస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

Advertisement

బిజెపికి కూడా బాబు బద్దశత్రువుగా మారడంతో వారి సహకారంతో బాబు ని బుక్ చెయ్యాలని కేసీఆర్ ఆలోచన.బాబు విషయానికి వస్తే ఆయన ఎక్కడా తగ్గేలా కనిపించడంలేదు.

తెలంగాణాలో టీడీపీకి బలమైన కార్యకర్తలు ఉన్నారని, కొంచెం గట్టిగా ఇక్కడ ప్రచారం చేస్తే చెప్పుకోదగిన స్థాయిలో సీట్లు సంపాదించవచ్చని అభిప్రాయపడుతున్నాడు.అందుకే తెలంగాణలో తాను చేసిన అభివృద్ధి గురించి ప్రస్తావించబోతున్నారు.

తన హయాంలో హైదరాబాద్‌ ఎలా అభివృద్ధి చెందిందో.చెప్పబోతున్నారు.

నాలుగున్నరేళ్ల టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేయబోతున్నారు.పార్టీ గెలిచే సీట్లలో ఆయన రోజుల తరబడి ప్రచారం చేసేందుకు కూడా సిద్ధం అవుతున్నాడు.

బాబు దూకుడు పెంచేందుకు సిద్ధం అవుతుండడం కేసీఆర్ లో ఆందోళన పెంచుతోంది.అందుకే ఆ దూకుడుకి అడ్డుకట్ట వేయడానికి ఓటుకు నోటు కేసును కెసిఆర్‌ బయటకు తీస్తారని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అంటున్నారట.దీనిపై ఇప్పటికే ఒక వ్యూహాన్ని కెసిఆర్‌ సిద్దం చేశారని ప్రచారం జరుగుతోంది.

బాబు కనుక మళ్లీ హైదరాబాద్‌కు వస్తే.ఎలా వ్యవహరించాలో మాకు తెలుసు.

మా దెబ్బేంటో రుచి చూపిస్తాం అంటూ టీఆరఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.మరుగున పడిపోయిందనుకున్న ఆ కేసు మళ్లీ తిరిగి తోడితే తనకు ఇబ్బందేనని, అలా అని తెలంగాణాలో ప్రచారం చెయ్యకపోతే పార్టీకి నష్టం కనుక ఈ రెండు విషయాలను ఏదో ఒక రకంగా పరిష్కరించుకోవాలని బాబు చూస్తున్నాడు.

తాజా వార్తలు