వైసీపీ రెబెల్ ఎంపీ పై అట్రాసిటీ కేసు నమోదు..!!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మొదటి నుండి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా.

మీడియా సమావేశాలు నిర్వహిస్తూ.తనదైన శైలిలో వ్యంగ్యంగా రఘురామకృష్ణంరాజు విమర్శలు చేస్తూ ఉంటారు.

Case File Against Rebel Mp Raghu Rama Krishnam Raju YSRCP, Raghu Rama Krishna

ఇదిలాఉంటే ఆయనపై గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటంతో cid కేసు నమోదు కావడంతో.గతంలో విచారణకు వెళ్లి.

కొన్ని రోజుల పాటు జైల్లో ఉన్న రఘురామకృష్ణంరాజు తర్వాత బెయిల్ పై బయటకు వచ్చి గత కొద్ది నెలల నుండి ఢిల్లీ లో ఉంటున్న సంగతి తెలిసిందే.అయితే ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత నియోజకవర్గానికి వస్తున్నట్లు దమ్ముంటే కాస్కోండి అన్న తరహాలో.

Advertisement

ఏపీ ప్రభుత్వానికి సవాల్ గా సంచలన వ్యాఖ్యలు మీడియా సమావేశంలో చేశారు.అయితే అనంతరం ఢిల్లీ నుండి హైదరాబాద్ కి రాగానే సిఐడి పోలీసులు నోటీసులు రఘురామకృష్ణంరాజు అందించడంతో.

తిరిగి ఢిల్లీకి పయనం అయిపోయారు.ఇటువంటి తరుణంలో రఘురామకృష్ణంరాజు పైపశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకేసు నమోదు అయ్యింది.

విషయంలోకి వెళితే ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ పై కులం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేశారని అసభ్య పదజాలంతో దూషించారని.సునీల్ కుమార్ స్వగ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో.

పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు