విశాఖ ఉక్కు ఆందోళనలు కేంద్రం మనసు మార్చలేవా?

భారత తీర ప్రాంతంలోని ఏర్పాటు చేయబడిన ఏకైక ప్రభుత్వ రంగ ఉక్కు సంస్థ, భారతదేశంలోని అత్యాధునికమైన ప్రభుత్వ రంగ ఉక్కు తయారీదారిగా గుర్తింపు, 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పాటు చేసుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం ( Visakha Steel Plant)ఇక ప్రైవేట్ యాజమాన్యానికి మారిపోతుందంటే మనసు బాద పడక మానదు.కేంద్ర ప్రభుత్వం( Central Govt) మనసు మార్చి ఈ నిర్ణయాన్ని వెనుక తీసుకునే విధంగా చేయడం కోసం ఎంతోమంది గత కొన్ని నెలలుగా తీవ్రమైన ఉద్యమాలు చేస్తున్నారు అయితే మొండివాడు రాజు కన్నా బలవంతుడు అంటారు మరి రాజే మొండివాడైతే? కేంద్ర ప్రభుత్వం తీరు చూస్తుంటే ఇదే సామెత గుర్తుకొస్తుంది.

ఎన్ని రకాల ఉద్యమాలు చేసినా కనీసం చీమకుట్టినట్లుగా కూడా కేంద్రానికి లేదు ఇప్పటికే పార్లమెంట్లో అనేకసార్లు ఈ నిర్ణయాన్ని మార్చుకునేది లేదు అని ప్రకటించిన కేంద్రం ఇప్పుడు మరోసారి అదే ప్రకటనకు కట్టుబడి ఉన్నాం అంటుంది.రాజ్యసభలో టిడిపి సభ్యుడు కనకమేడల రవీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ కేంద్ర సహాయ మంత్రి ఈ విషయంలో కేంద్రం నిర్ణయంలో తిరుగు లేదంటూ మరొకసారి కుండ బద్దలు కొట్టారు.ఉద్యోగుల ఆందోళన అర్థం చేసుకోగలమని అంటూనే చర్చల ద్వారా వారి మనసును మారుస్తామని తెలిపారు .ఈ విషయంపై పునః పరిశీలించే అవకాశం ఏమైనా ఉందా అన్న ప్రశ్నకు లేదని ఆయన సమాధానం ఇచ్చారు ఇప్పటికే ఉక్కు కర్మాగారంలో నియామకాలు నిలిచిపోయాయి రిటైర్ వెళ్ళిపోతున్న వారితో ఉద్యోగుల సంఖ్య మెల్లగా తగ్గుతుంది.

దీన్నిబట్టి కేంద్రం పరోక్ష పద్ధతిలో మెల్లగా దీని గొంతు నులిమే ప్రయత్నాలు చేస్తుందని ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు.పూర్తిస్థాయి సంఖ్యాబలం ఉండటం వల్లే మోడీ ప్రభుత్వం( Modi Govt) సామాన్య ప్రజల గోడు పట్టించుకోవడంలేదని, ఇంతకు ముందు జరిగిన రైతు ఉద్యమాలు కూడా ప్రభుత్వం ఇలానే ఉక్కుపాదంతో అలిచివేసిందని ఇప్పుడు ఈ ఉక్కు పరిశ్రమను విషయం లో కూడా ఇలానే ప్రజాభి ప్రయనికి వ్యతిరేఖం గా వెళ్తుంది అని, ఈ నిర్ణయాలకు కచ్చితంగా మోడి ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి వస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి .

Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich
Advertisement

తాజా వార్తలు