నెట్ లేకపోయినా పే చెయ్యొచ్చు: NPCI

డిజిటల్ చెల్లింపులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న భారత ప్రభుత్వం మద్దత్తు తో రబీ మరింత వేగం గా ముందుకు వెళుతున్నట్లుగా తెలుస్తుంది.

ఇప్పటివరకు యూపీఏ పేమెంట్స్ క్యూఆర్ కోడ్ పేమెంట్స్ మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు మరింత సులభతరమైన కొత్త పేమెంట్ విధానాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది .

గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ -2023లో బాగం గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత గవర్నర్ శక్తి కాంత్ దాస్ ( Governor Shakti Kant Das )వీటిని ఆవిష్కరించారు.యూపీఐ, యూపీఐ లైట్ ఎక్స్ , టాప్ అండ్ పే, హలో యూపీఐ , బిల్ పై కనెక్ట్ పేరుతో మొత్తం ఐదు పేమెంట్ విధానాలను తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు.

డిజిటల్ పేమెంట్స్( Digital payments ) మరింత సులభతరం కానున్నాయని ఇకపై ఇంటర్నెట్ సౌకర్యం లేని చోట ఆన్లైన్లో లావాదేవీలు చేసేందుకు యూపీఐ లైట్ ఎక్స్ ఉపయోగపడుతుందని ప్రస్తుతం ఉన్న స్కాన్ అండ్ ఫేక్( Scan and fake ) అదనంగా టాప్ అండ్ పే తీసుకొస్తున్నామని దీని సాయంతో చెల్లింపులు చేయాలంటే nfc ని ఎనేబుల్ చేసుకొని క్యూఆర్ కోడ్ వద్ద ట్యాప్ చేస్తే చాలు ,చెల్లింపులు పూర్తి చేయవచ్చు .అదేవిధంగా హలో యూపీఐ విధానంతో వాయిస్ ఆధారిత చెల్లింపులు చేసే వెసులుబాటు తీసుకువచ్చింది.ప్రస్తుతానికి ఇంగ్లీష్ హిందీ భాషల్లో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో మిగతా భాషల్లో కూడా ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు.

ఇక బిల్ పే కనెక్ట్ ( Bill Pay Connect )పేరుతో దేశమంతా బిల్లు చెల్లింపుల కోసం జాతీయకరించిన ఒక నెంబర్ను పరిచయం చేశారు.దీంతో మెసేజ్ యాప్ లో కేవలం హాయ్ అని సందేశం పంపడం ద్వారా చెల్లింపులు చేయవచ్చు.

Advertisement

అలాగే బిల్లులు పొందవచ్చు.

స్మార్ట్ఫోన్ మొబైల్( Smartphone mobile ) డేటా యాక్సెస్ లేని సందర్భాల్లో కేవలం మిస్డ్ కాల్ ద్వారా పేమెంట్ చేయవచ్చు.యూపీఐ క్రెడిట్ లైన్ ద్వారా బ్యాంకులలో ముందుగా మంజూరు చేసిన క్రెడిట్ లైన్లు వినియోగించుకోవడానికి ఈ సదుపాయం ఉపయోగపడుతుంది .యూపీఏ చెల్లింపుల కోసం ఈ రుణాలను వినియోగించుకోవచ్చు.nfci తీసుకొస్తున్న ఈ విధానాలతో భారత డిజిటల్ పేమెంట్ రంగం మరింత ముందుకు వెళ్తుంది అని గవర్నర్ వాఖ్యనించారు .

Advertisement

తాజా వార్తలు