దూసుకుపోతున్న ChatGPT పోటీని గూగుల్‌ బార్డ్‌ తట్టుకోగలుగుతుందా?

ChatGPT దూసుకుపోతున్న వేళ తాజాగా గూగుల్ ఓ సంచలన ప్రకటన చేసింది.

అవును, ‘బార్డ్’ అనే పేరుతో కొత్త ప్రయోగాత్మక కృత్రిమ మేథ (AI - ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) చాట్‌బోట్‌ను తాజాగా పరిచయం చేసి, షాకిచ్చింది.

శాన్ ఫ్రాన్సిస్కో ఆధారిత ChatGPTకి పోటిగా దీనిని లాంచ్ చేసినట్టు తెలుస్తోంది.ఈ సందర్భంగా సంస్థ CEO అయినటువంటి సుందర్ పిచాయ్ బార్డ్ గురించి వివరిస్తూ ఒక బ్లాగ్‌పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు.

"బార్డ్ అనేది వివిధ భాషా నమూనాల కలయిక, తెలివి మరియు సృజనాత్మకతతో కూడిన ప్రపంచ జ్ఞానం" అని పేర్కొన్నారు.

దూసుకుపోతున్న Chatgpt పోటీని గూగు�

ఇకపోతే గత సంవత్సరం నవంబర్ చివరిలో విడుదలైన శాన్ ఫ్రాన్సిస్కో కంపెనీ ఓపెన్‌ AIచే సృష్టించబడిన ChatGPT, కేవలం సెకన్ల వ్యవధిలోనే వినియోగదారుల అవసరం మేరకు వ్యాసాలు, పద్యాలు లేదా ప్రోగ్రామింగ్ కోడ్‌ను వ్రాయగల సత్తాని కలిగి ఉంది.ఈ క్రమంలో ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ గత నెలలో దీనికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది.అలాగే ChatGPT ఫీచర్‌లను దాని టీమ్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఇంటిగ్రేట్ చేయడం మొదలు పెట్టింది కూడా.

Advertisement
దూసుకుపోతున్న ChatGPT పోటీని గూగు�

ఈ ChatGPT కేవలం రెండు వారాల వ్యవధిలోనే 100 మిలియన్ యూజర్లను ఆకట్టుకుందని సంచలం సృష్టించింది.ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సంస్థకు ప్రముఖ పోటీదారు అయినటువంటి గూగుల్ ChatGPTకి పోటీగా బార్డ్ అనే కొత్త AI ప్రోగ్రామ్‌ను ప్రకటించింది.

దూసుకుపోతున్న Chatgpt పోటీని గూగు�

బార్డ్ వినియోగదారులకు కింది విధంగా ఉపయోగపడగలదు: 1.‘బార్డ్’ యూజర్లు అడిగే ప్రశ్నలకు ఖచ్చితమైన, స్పష్టమైన తాజా సమాచారాన్ని ఇట్టే అందిస్తుంది.అయితే దీనికోసం బార్డ్ వెబ్ నుండి సమాచారాన్ని తీసుకుంటుంది.2.మీ అందమైన పార్టీ కోసం చిట్కాలను అందించడం అలాగే రిఫ్రిజిరేటర్‌లో మిగిలి ఉన్న ఆహారాన్ని బట్టి లంచ్ ప్రిపరేషన్ వంటి వాటిలో మీకు సహకరిస్తుంది.3.పిల్లలకు అర్థమయ్యేరీతిలో ఈ చాట్‌బోట్ అత్యంత క్లిష్టమైన అంతరిక్ష ఆవిష్కరణల విషయాలను సరళంగా వివరిస్తుంది.4.ChatGPT 2021 వరకు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సమాధానాలు ఇస్తుంది.

బార్డ్ మాత్రం ఆన్‌లైన్‌లో ఉండే తాజా సమాచారాన్ని కూడా విశ్లేషించి సమాధానాలు ఇస్తుందని తెలుస్తోంది.

షియోమి/ రెడ్ మీ మొబైల్స్ లో మీకు పనికివచ్చే 7 రహస్య ట్రిక్స్
Advertisement

తాజా వార్తలు