సీఏఏ హింస, డ్రైనేజి నుంచి వెలువడ్డ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ శవం

ఈశాన్య ఢిల్లీ లో గత కొద్దీ రోజులుగా హింస చెలరేగుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ హింస లో దాదాపు 18 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది.

సీఏఏ కు వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్ల లో మంగళవారం నాటికి 13 మంది మృతి చెందగా, బుధవారం నాటికి ఆ సంఖ్య 18 కి చేరినట్లు తెలుస్తుంది.అయితే ఈ అల్లర్లలో భాగంగా ఇంటెలిజెన్స్ బ్యూరో శాఖ లో పనిచేస్తున్న ఆఫీసర్ చనిపోయినట్లు తెలుస్తుంది.

ఒక డ్రైనేజి లో అంకిత్ శర్మ అనే వ్యక్తి శవం బయటపడింది.అయితే అతడు ఇంటెలిజెన్స్ బ్యూరో శాఖలో పనిచేస్తున్నట్లు సమాచారం.

సీఏఏకు వ్య‌తిరేకంగా జ‌రిగిన హింస‌లో ఇప్ప‌టికే 20 మంది మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది.వంద‌ల సంఖ్య‌లో జ‌నం గాయ‌ప‌డ్డారు.

Advertisement

మరోపక్క ఢిల్లీ లో చెలరేగిన హింస అయిదో రోజుకు చేరుకున్న‌ది.అయితే తొలి రోజు జ‌రిగిన హింస‌లో ఓ పోలీసు ఆఫీస‌ర్ కూడా ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే.అయితే తాజాగా ఇంటెలిజెన్స్ బ్యూరో లో పనిచేసే అంకిత్ వర్మ శవం లభించింది.2017లో అంకిత్ డ్రైవ‌ర్‌గా ఐబీలో చేరగా, ప్ర‌స్తుతం అత‌ను సెక్యూర్టీ అసిస్టెంట్ ర్యాంక్‌లో ఉన్నట్లు తెలుస్తుంది.

సీఏఏ వ్యతిరేక,అనుకూల వర్గాల మధ్య చెలరేగిన ఈ హింస నేపథ్యంలో అర్ధరాత్రి ఢిల్లీ హైకోర్టు అత్యవసరంగా విచారణ చేపట్టింది.ఈ హింసలో గాయపడిన క్షతగాత్రులకు అత్యవసర వైద్య సాయం అందించాలి అంటూ కోర్టు పోలీసులకు స్పష్టం చేసింది.జస్టిస్ ఎస్.మురళీధర్ నివాసంలో అత్యవసరంగా విచారణ చేపట్టగా క్షతగాత్రులకు అత్యవసర వైద్య సాయం అందించి,నివేదిక సమర్పించాలి అంటూ పోలీసులను ఆదేశించినట్లు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు