వెండి తాబేలు ఇంట్లో ఈ దిశలో ఉంచడం వల్ల.. వ్యాపారంలో లాభాలతో పాటు పిల్లల..

మన దేశంలో చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు.

సాధారణంగా ఇంట్లో, వ్యాపార స్థలాలలో, అలాగే ఆఫీసులలో వాస్తు ప్రకారం కొన్ని రకాల విగ్రహాలను, వస్తువులను అమర్చుకుంటూ ఉంటారు.

వాస్తు ప్రకారం గా ఆ వస్తువులను అమర్చడం వల్ల ఆర్థికంగా లాభలు రావడంతో పాటు ఆనందం, ప్రశాంతత ఉంటుందని వారి నమ్మకం.అయితే వాస్తు నియమాలు( Vastu tips ) పాటించకపోతే మానసికంగా మాత్రమే కాకుండా శరీరకంగా చెడు ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

వాస్తు నియమాలను పాటించకపోతే ఆర్థిక పరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.అందువల్ల వాస్తు దోషాల నుంచి అలాగే కష్టాల నుంచి విముక్తి పొందాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల వస్తువులను ఇంట్లో అమర్చడం మంచిది.

అందులో ముఖ్యంగా వెండి తాబేలు(Silver turtle ) ఒకటి.ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో వెండి తాబేలు ఒక చోట అమర్చడం వల్ల డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు.

Advertisement

అదే విధంగా శరీరక సమస్యలు కూడా దూరం అవుతాయి.వ్యాపారంలో నష్టాలు ఉన్న వారు వెండి తాబేలుతో చేసిన ఉంగరాన్ని( Ring ) ధరిస్తే వ్యాపారం ఎంతో వృద్ధి చెందుతుంది.

అయితే తాబేలను పచ్చి పాలతో పూజించిన తర్వాతే చేతికి ధరించడం మంచిది.

అంతే కాకుండా ఇంట్లో వెండి తాబేలు విగ్రహాన్ని ఉత్తర దిశలో ఉంచడం వల్ల ఆ ఇంటికి ఎంతో మంచిది.వెండి తాబేలు ఉంచే పాత్రలో కాస్త నీరు పోసి అందులో తాబేలు ఉంచడం మంచిది.ముఖ్యంగా చెప్పాలంటే మీ పిల్లలు ఎంత చదివినా చదువులో ఆశించిన ఫలితాలు అందుకోలేకపోతుంటే వెండి తాబేలు వారు చదువుతున్న గదిలో ఉంచితే పిల్లల మనసు ప్రశాంతంగా ఉండి చదువు పై దృష్టి పెడతారు.

అంతే కాకుండా పిల్లలు చదువులో బాగా రాణిస్తారు.

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?
Advertisement

తాజా వార్తలు