జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్.. కొత్తగా మరో ఓటీటీ కూడా..

ప్రస్తుతం టెలికాం, బ్రాడ్‌బ్యాండ్ రంగంలో జియో దూసుకెళ్తోంది.వినియోగదారులను పెంచుకుంటూ మిగతా సంస్థలకు గట్టి పోటీ ఇస్తోంది.

సేవలను కూడా పెంచుతూ వినియోగదారులను మరింతగా ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.ఇప్పటికే ఎయిర్‌టెల్‌కు గట్టి పోటీ ఇస్తూ జియో టాప్ పొజిషన్‌కు చేరుకునే చేరువలో ఉంది.

అందుకోసం మిగతా సంస్థల వినియోగదారులను ఆకర్షించేందుకు బంపర్ ఆఫర్లు సైతం ప్రకటిస్తూ తమవైపునకు తిప్పుకునేందుకు కసరత్తులు చేస్తోంది.అందులో భాగంగానే తాజాగా బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది.

జియో ఫైబర్ నెట్ వర్ ద్వారా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారికి సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది.ఓటీటీలో కలిపిన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను ఎంచుకుంటే అదనంగా యూనివర్సల్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఇవ్వనుంది.

Advertisement

ఇంతకుముందు లేదని, ఓటీటీతో కలిపి తీసుకునే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో కొత్తగా దీనిని ప్రవేశపెట్టినట్లు జియో వర్గాలు తెలిపాయి.

ఓటీటీ సబ్‌స్కిప్షన్ తో కలిపి తీసుకునే బేసిక్ జియో బ్రాండ్‌బ్యాండ్ ప్లాన్ రూ.999లో అదనంగా యూనివర్సల్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ కూడా వస్తుందని జియో స్పష్టం చేసింది.జియో బ్రాండ్ బ్యాండ్ ప్లాన్ రూ.999 ద్వారా అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లాస్ హాట్‌స్టార్ తో పాటు 16 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ లను ఉచితంగా పొందవచ్చు.ఈ ప్లాన్ ద్వారా సెటాప్ బాక్స్ కూడా ఉచితంగా పొందవచ్చని జియో తెలిపింది.

ఈ సెటాప్ బాక్స్ ద్వారా స్మార్ట్‌టీవీలలో కాకుండా సాధారణ టీవీకి కూడా కెనెక్ట్ చేసి ఓటీటీ సర్వీసులు పొందవచ్చని పేర్కొంది.దేశవ్యాప్తంగా వినియోగదారులకు మరిన్ని సేవలను అందించేందుకు కృషి చేస్తున్నామని, జియో ఫైబర్ ద్వారా మెరుగైన సేవలను అందిస్తామని పియో సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు.

త్వరలోనే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లలో మరిన్ని ఫీచర్లను వినియోగదారులకు అందించి తమ సేవలను పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు జియో వర్గాలు పేర్కొన్నాయి.

చర్మ ఆరోగ్యం కొరకు ద్రాక్షలో ఉన్న ప్రయోజనాలు
Advertisement