యువకుడిని కొమ్ములతో కుమ్మేసిన ఎద్దు.. అయ్యో పాపం!

జంతువులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలుసుకోవడం చాలా కష్టం.వాటికి చిన్న పాటి అసౌకర్యం కలిగినా.

అస్సలు ఊరుకోవు.అమాయకంగా వెళ్తున్న వాటిని బెదిరించినా, కదిలించినా వాటికి తీవ్రంగా కోపం వస్తుంది.

ముఖ్యంగా ఆవులు, ఎద్దులు, దున్నపోతులు, గేదెల లాంటి జంతువులు.మామూలు రోజుల్లో సాదు జంతువులుగా ఉంటాయి.

యజమాని పట్ల చాలా సానుకూలంగా వ్యవహరిస్తాయి.ఇతరుల పట్ల కూడా ఏమాత్రం కోపాన్ని ప్రదర్శించవు.

Advertisement

కానీ ఒక్కోసారి చాలా వైల్డ్ గా ప్రవర్తిస్తాయి.వాటి కొమ్ములతో కుమ్మేస్తాయి.

అలాంటి ఘటనే హిమాచల్ ప్రదేశ్ లో జరిగింది.ఎద్దు దాడిలో ఓ యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.

అసలేం జరిగిందంటే.హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో ఓ యువకుడిపై ఎద్దు దాడి చేసింది.

ప్రముఖ పుణ్య క్షేత్రం త్రివేణి సంగమ రేవల్ సర్ మార్కెట్లో తిరుగుతున్న ఎద్దు.వ్యక్తిపై దాడి చేసింది.

త్రివిక్రమ్ కథ చెప్తుంటే పవన్ కల్యాణ్ నిద్ర పోతే, మహేష్ బాబు లేచి వెల్లిపోయారట
సోదరి, బావ కలిసి చేతబడి చేశారంటూ పోలీస్ కంప్లైంట్.. అధికారులు షాక్..??

బస్సు మలుపు తీసుకుంటున్న సమయంలో ఆ పక్కనే రోడ్డుపై ఉన్న వాటిని తింటూ ఉంది ఆ ఎద్దు.మలుపు తీసుకుంటున్న బస్సు పక్కనే ఆ వ్యక్తిపై దాడి చేసింది ఎద్దు.

Advertisement

రెండు కొమ్ములతో వ్యక్తి ఎత్తి కింద పడేసింది.దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

అయితే దాడి తర్వాత ఎద్దు చల్లగా అక్కడి నుండి వెళ్లిపోయింది.అయితే కొమ్ములతో కుమ్మేసిన తర్వాత ఆ వ్యక్తి కూడా నడుస్తూ పొట్టను పట్టుకుని అక్కడి నుండి వెళ్లి పోయాడు.

ఎద్దు కుమ్మేస్తున్న సమయంలో అతడిని కాపాడేందుకు ఓ వ్యక్తి పరుగున అక్కడికి వచ్చాడు.సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి ఆ దృశ్యాలు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజా వార్తలు