ఉప్పెన దర్శకుడు వెయిట్‌ చేయాల్సిందేనా.. చరణ్‌ నిర్ణయంపై సస్పెన్స్‌

ఉప్పెన వంటి సూపర్ హిట్ సినిమా చేసిన దర్శకుడు బుచ్చిబాబు వెంటనే తన తదుపరి సినిమా ను మొదలు పెట్ట లేక పోయాడు ఎన్టీఆర్ పిలిచి అవకాశం ఇవ్వడం తో చాలా నెలలు వెయిట్ చేసిన బుచ్చిబాబు ఆ సినిమాకి చాలా సమయం పట్టే అవకాశం ఉందని భావించి రామ్‌ చరణ్ వద్దకు వెళ్లాడు.రామ్ చరణ్ కూడా బుచ్చి బాబు యొక్క కథ కు ఓకే చెప్పాడు కానీ ప్రస్తుతం చేస్తున్న శంకర్ సినిమా పూర్తి అవడానికి చాలా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆ మధ్య ఆగస్టు నెలలోనే రామ్ చరణ్ హీరో గా బుచ్చి బాబు దర్శకత్వం లో సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అంటూ వార్తలు వచ్చాయి.కానీ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో ఆస్కార్ అవార్డు వేడుక కోసం ఉన్నాడు, ఈ నెల చివరి వరకు కూడా రామ్‌ చరణ్ ఇండియాకి వచ్చే పరిస్థితి లేదు.కనుక శంకర్ దర్శకత్వం లో సినిమా చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

శంకర్ దర్శకత్వంలో సినిమా ఆలస్యం అయితే దర్శకుడు బుచ్చి బాబు కూడా మరిన్ని నెలలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు.రామ్ చరణ్ మరియు బుచ్చిబాబు కాంబినేషన్ లో సినిమా ఈ సంవత్సరం లో ప్రారంభం అవుతుందా లేదా అనేది అనుమానంగా మారింది.

వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.రామ్ చరణ్ ని బుచ్చిబాబు ఎలా చూపించబోతున్నాడు అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Advertisement

రంగస్థలం సినిమా తరహా లో రామ్ చరణ్ తో ఒక పల్లెటూరి నేపథ్యమున్న సినిమా ను బుచ్చి బాబు రూపొందించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఆ మధ్య బుచ్చిబాబు ప్రైవేట్ సంభాషణలో ఒక మంచి కథను రామ్ చరణ్ కోసం రెడీ చేసినట్లుగా పేర్కొన్నాడు.రామ్ చరణ్ మరియు బుచ్చి బాబు కాంబినేషన్ సినిమా మెగా ఫ్యాన్స్ ని మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరిని అలరించే అవకాశాలు ఉన్నాయి.కానీ వీరి కాంబో సినిమా ప్రారంభం అవ్వాలంటే చాలా రోజులు వెయిట్ చేయాల్సిందే.

శంకర్ సినిమా పూర్తి అయిన తర్వాతే కొత్త సినిమా మొదలు పెట్టాలని చరణ్‌ భావిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.చరణ్ నిర్ణయం పై సస్పెన్షన్ నెలకొంది.ఆయన కొత్త సినిమా ఎప్పుడు మొదలు పెడతాడు అనేది చూడాలి.

అప్పటి వరకు బుచ్చి బాబు వెయిట్‌ చేయాల్సిందే.

Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich
Advertisement

తాజా వార్తలు