బుచ్చిబాబుకు హీరో దొరికాడోచ్!

టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయిన ఉప్పెన చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.

గతేడాదే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

ఒక సమయంలో ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ ఎట్టకేలకు ఫిబ్రవరి 12, 2021 రోజున ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల నడుమ రిలీజ్ చేశారు.

ఇక ఈ సినిమాకు మొదటి రోజునే పాజిటివ్ రివ్యూలు రావడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు ఎగబడ్డారు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ అసిస్టెంట్ అయిన బుచ్చిబాబు సానా ఈ సినిమాతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడని ప్రేక్షకులు ఆయన్ను ఆకాశానికి ఎత్తేశారు.

ఇక ఉప్పెన చిత్రం అందుకున్న సక్సెస్‌తో బుచ్చిబాబుతో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తిని చూపుతుండటంతో, అతడి నెక్ట్స్ చిత్రం ఎవరితో ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.అయితే బుచ్చిబాబు సానా తన నెక్ట్స్ చిత్రాన్ని స్టార్ హీరోతో చేస్తాడనే టాక్ సినీ వర్గాల్లో జోరుగా వినిపించింది.

Advertisement

కానీ అవన్నీ కేవలం రూమర్లేనని, బుచ్చిబాబు తన నెక్ట్స్ చిత్రాన్ని అక్కినేని నాగచైతన్యతో చేసేందుకు రెడీ అవుతున్నట్లు టాలీవుడ్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.ప్రస్తుతం లవ్‌స్టోరి చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేస్తున్న నాగచైతన్య, ఆ తరువాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్ యూ’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా తరువాత బుచ్చిబాబు సానాతో చైతూ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే బుచ్చిబాబు చైతూకి ఓ స్టోరీలైన్ వినిపించాడని, త్వరలోనే ఈ కథకు సంబంధించిన స్క్రిప్టు పనులు పూర్తి చేసి సినిమాను ప్రారంభిస్తాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఉప్పెన లాంటి అదిరిపోయే సక్సెస్ తరువాత బుచ్చిబాబు అక్కినేని నాగచైతన్య కోసం ఎలాంటి కథను రెడీ చేస్తున్నాడా అనే ఆసక్తి అటు అక్కినేని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా నెలకొంది.

ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను.. సోనమ్ కపూర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Advertisement

తాజా వార్తలు