కోదండరామిరెడ్డికి మాట ఇచ్చి తప్పిన బుచ్చిరెడ్డి..

గోపాలకృష్ణుడు అనే సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు హీరో పాత్ర పోషించాడు.ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేశాడు.

దీంతో ఆసినిమాపైవిడుదలకు ముందే భారీ అంచనాలు పెరిగాయి.ఈ సినిమలో అక్కినేని గోపాలకృష్ణుడి రోల్ ప్లే చేస్తున్నాడు.

ఈ పాత్ర రోమియో క్యారెక్టర్ కు చాలా దగ్గరగా ఉంది.దీంతో ఏఎన్నార్ వెంటనే ఓకే చెప్పాడు.

ఈ పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉంటుందని ఆయన ముందుగానే తెలుసుకున్నాడు.చాలా రోజుల తర్వాత అమ్మాయిల వెంటపడుతూ, డ్యూయెట్ సాంగ్స్ చేసే రోల్ లో ఆయన ఒదిగిపోయడు.

Advertisement
Bucchi Reddy Ignored Kodanda Rami Reddy Promise , Bucchi Reddy, Kodanda Rami Red

మంచి హుషారు ఎక్కించే పాత్ర కావడంతో ఆయన కూడా మస్త్ యాక్టివ్ గా పనిచేశాడు.ఈ సినిమాలో నాగేశ్వర్ రావు సరసన నటించేందుకు జయసుధను హీరోయిన్ గా తీసుకున్నారు.

ఆమె కూడా అక్కినేనికి పోటీగా నటించింది ఈ సినిమాలో.అక్కినేని, కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది.

గోపాలకృష్ణుడు సినిమా షూటింగ్ కంప్లీట్ కాకుండానే.ఇదే కాంబినేషన్ లో మరో సినిమా చేయబోతున్నట్లు నిర్మాత బుచ్చిరెడ్డి వెల్లడించాడు.

ఈ విషయం దర్శకుడు కోదండరామిరెడ్డికి కూడా తెలియకపోవడం విశేషం.ఈ సినిమాకు సంబంధించిన వార్త మరుసటి రోజు పత్రికల్లో వచ్చింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
సూపర్ స్టార్ మహేష్ బాబు నయా లుక్ వైరల్.. ఈ లుక్ మాత్రం అదిరిపోయిందిగా!

ఈ వార్తలు చూసి కోదండరామిరెడ్డి అవాక్కయ్యాడు.వెంటనే నిర్మాతకు ఫోన్ చేసి ఏంటండీ? నాతో చెప్పకుండానే ప్రకటించారు? అని అడిగాడు.

Bucchi Reddy Ignored Kodanda Rami Reddy Promise , Bucchi Reddy, Kodanda Rami Red
Advertisement

అక్కినేని నీ అభిమాన హీరో కదా.ఆయనతో మరోసారి కలిసి పనిచేసే అవకాశం వస్తే చేయవా ఏంటి అంటూ నవ్వాడు బుచ్చిరెడ్డి.భారీ అంచనాల మధ్య గోపాలకష్ణుడు సినిమా ఘనంగా రిలీజ్ అయ్యింది.

ఎంతో ఆర్భాటంగా విడుదల అయిన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.అదే సమయంలో కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన మరో సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.దాంతో బుచ్చిరెడ్డి మనసు మార్చుకున్నాడు.

కోదండరామిరెడ్డి – అక్కినేని కాంబినేషన్ లో చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన.మళ్లీ ఈ సినిమా క్యాన్సిల్ చేస్తున్నట్లు వెల్లడించాడు.

తాజా వార్తలు