RS Praveen Kumar : త్వరలో బీఆర్ఎస్- బీఎస్పీ సీట్ల పంపకాలు..: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ( BRS, BSP ) మధ్య పొత్తు పొడిచింది.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ( RS Praveen Kumar )సమావేశం అయిన సంగతి తెలిసిందే.

భేటీ అనంతరం పొత్తుతో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు.కలిసి పోటీ చేస్తామన్న ఆయన త్వరలో సీట్ల పంపకాలు జరుగుతాయని చెప్పారు.

బీజేపీ, కాంగ్రెస్( BJP , Congress ) తో రాజ్యాంగానికి ముప్పు ఉందని ఆరోపించారు.ఈ నేపథ్యంలో తమను తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేస్తారు.

బీఎస్పీ అధినేత్రి మాయవతితో చర్చించిన తరువాత త్వరలో విధివిధానాలను ప్రకటిస్తామని వెల్లడించారు.

Advertisement
Almonds Health Benefits Homemade Neem Leaves Tea Benefits TeluguStop

తాజా వార్తలు