Brother anil wants vijayawada MP seat..?

వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయాలలో రాటుదేలారు అనడానికి ప్రస్తుతం తానూ ప్రవర్తించే తీరు నిదర్సనంగా కనిపిస్తుంది.

మొన్నటివరకు జగన్ మోహన్ రెడ్డిని క్రీస్టియన్లకి ఆపాదించే వారు రాజకీయనాయకులు.

అలా చేయడం వలన జగన్ హిందువులకి దూరం అయ్యారు అనేది వాస్తవం.ఆ మచ్చని చెరిపి నేను అందరివాడిని అని అనిపించుకోవడానికి జగన్ అప్పుడప్పడు హిందూ స్వామీజీల వద్దకు వెళ్ళడం.

గుడులు గోపురాలు తిరగడం హిందువులకి చేరువ కావడం జరిగింది.మొన్నటికి మొన్న చిన్నజీయర్ స్వామీజీని కలవడంతో హిందువులు కూడా జగన్ కి సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఇప్పుడు క్రీస్టియన్లకి దూరం కాకుండా ఉండటానికి జగన్ వేసిన స్కెచ్ మాములుగా లేదు.మునుపటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తన బావ బ్రదర్ అనిల్ తో క్రీస్టియన్ల ఓట్లు సంపాదించడంలో సక్సెస్ అయ్యారు.

Advertisement

అయితే పార్టీ ఓడినతరువత అనిల్ ఎక్కడా వైసీపిలో కనపడలేదు.ఇప్పుడు మళ్ళీ జగన్ పక్కన కనపడటం చర్చనీయంసంగా మారింది తాజాగా బెజవాడలోని పార్టీ ఆఫీస్ కు వచ్చిన జగన్ తో బ్రదర్ అనిల్ రాసుకు పూసుకు తిరగడం, అక్కడ ఏర్పాటు చేసిన మీటింగ్ లో ఆయన కూడా కూర్చోవడం వైసీపీ నాయకుల్లో చర్చకు వచ్చింది.

అంతేకాదు.లోటస్ పాండ్ పార్టీ ఆపీసులో కూడా ఆయన తరచు కనిపిస్తుండడంతో ఎదో సూచన కనిపిస్తోంది అని తెలుస్తోంది.

ఇదే అంశం మీద అందిన సమాచారం ప్రకారం.కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.

మళ్ళీ ఎన్నికలు దెగ్గర పడుతున్నాయి తన బావ అవసరం తప్పని సరికానుంది సో ఇప్పుడు తన బావ అనిల్ కి పెద్ద పీట వేస్తున్నాడు.ఇదే అదునుగా భావించిన అనిల్ కూడా తనతెలివితెతలకి పని చెప్పాడ.

తనకి … బెజవాడ నుంచి వైసీపీ తరపున పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అయ్యేలా రాజకీయం చేస్తున్నాడు.ఒక పక్క జగన్ బావద్వారా లాభం పొందాలి అనుకుంటుంటే మరోపక్క అనిల్ కూడా ఎంపీ సిటుపై కన్నేశాడు.

Advertisement

మరి జగన్ ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో.