యువతకు స్ఫూర్తినిస్తున్న బర్గర్ ఫామ్ విజయ గాథ

ఇది ఇద్దరు యువకుల బర్గర్ ఫామ్ విజయ గాథ.

ఆ ఇద్దరూ పాఠశాల విద్యతోనే చదువులు మానివేశారు, ఇంటిలోని ఒక గదిలో చిన్నగా బర్గర్ దుకాణాన్ని ప్రారంభించారు.

ఈ బర్గర్ ఫామ్ ప్రారంభం వెనుక వారు ఎన్నో కష్టాలు పడ్డారు.పరమవీర్ సింగ్, రజత్‌లు 2013లో ఓ ట్యూషన్ సెంటర్‌లో ఫ్రెండ్స్‌గా మారారు.

ట్యూషన్ పూర్తికాగానే ఇద్దరూ కలిసి తిరుగుతూ బజారులో బర్గర్లు తినడానికి వెళుతుండేవారు.ఒకరోజు వారు బర్గర్ తింటుండగా వారి మనసులో ఒక వినూత్న ఆలోచన వచ్చింది.

తాము కూడా ఎందుకు బర్గర్‌ వ్యాపారం చేయకూడదని మనసులో అనుకున్నారు.తమ కలను నెరవేర్చుకునేందుకు భోజనప్రియులైన వీరిద్దరూ మార్కెట్‌లో ఒక పరిశోధన ప్రారంభించారు.

Advertisement

ఈ సందర్భంగా జైపూర్ మొదలుకొని ఢిల్లీ వరకు లభ్యమయ్యే ప్రతి బ్రాండ్ బర్గర్‌లను రుచి చూశారు.తరువాత 2014లో వారు తమ ఇంటిలోని ఒక గది నుంచే తమ తొలి అవుట్‌లెట్‌ను ప్రారంభించారు.

వీరు తమ బర్గర్‌ని ఇతర బర్గర్లకన్నా భిన్నంగా ఉండేందుకు, మార్కెట్‌లో నిలదొక్కుకోవడానికి లెక్కలేనన్న ప్రయోగాలు చేశారు.ఆరోగ్యాన్ని పెంపొందించేలా బచ్చలి మొక్కజొన్న, చీజ్‌ మిళితం చేసి నూతన రకాల బర్గర్‌లను రూపొందించారు.

మొదట్లో తమ వ్యాపారంలో సిబ్బంది లేరని వారు తెలిపారు.దీంతో వారి తల్లిదండ్రులు వీరికి అన్ని పనులలో సహకారం అందించేవారట.

రజత్ కుటుంబ సభ్యులు బర్గర్ దుకాణంలో వంతులవారీగా ఉంటూ సహాయం అందించేవారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

కాలానుగుణంగా కస్టమర్ల తాకిడి పెరిగింది.దుకాణంలోకి అవసరమైన కూరగాయలను వారే బజారుకు వెళ్లి తెచ్చుకునేవారు.పరమజీత్ కుటుంబానికి ఆటోమొబైల్ విడిభాగాల వ్యాపారం ఉండగా, రజత్ కుటుంబం నగల వ్యాపారం నిర్వహిస్తోంది.

Advertisement

ఈ బర్గర్ ఫామ్‌లో ప్రస్తుతం 200 మందికిపైగా సిబ్బంది ఉన్నారు.ఈ సంస్థ ఏడాదికి రూ.25 కోట్ల వ్యాపారం చేస్తోంది.రాజస్థాన్‌లోని ఒక్క జైపూర్‌లోనే బర్గర్ ఫామ్‌కు 12 అవుట్‌లెట్‌లు ఉండటం విశేషం.

ఇంతేకాకుండా జోధ్‌పూర్, కోట, శ్రీగంగానగర్‌లలో ఒక్కొక్కటి చొప్పున ఔట్‌లెట్లు ఉన్నాయి.త్వరలో రాజస్థాన్ అంతటా ఫ్రాంచైజీ వ్యవస్థను విస్తరించాలని ఈ కంపెనీ వ్యవస్థాపక స్నేహితులు నిర్ణయించుకున్నారు.

తాజా వార్తలు