ఊచల్లో ఇరుక్కున్న బాలుడి తల.. తర్వాత ఏం జరిగిందంటే?

సమస్య వచ్చినప్పుడు చాలా మంది భయపడిపోతూ ఉంటారు.అది చిన్న సమస్య అయినా దానిని చాలా పెద్దగా చూస్తారు.

తీవ్రంగా టెన్షన్ పడతారు.ఒత్తిడికి గురి అవుతుంటారు.

కొంత సేపు సావధానంగా ఆలోచిస్తే ఎలాంటి పెద్ద సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుంది.కానీ ఆలోచించాలన్న ఉద్దేశం కూడా వారికి ఉండదు.

సమస్య రాగానే భయపడిపోవడం, ఒత్తిడి చెందడం చేస్తుంటారు.కానీ సమస్యను చూసే దృష్టిని మారిస్తే ఎలాంటి సమస్యకైనా సొల్యూషన్ దొరికి తీరుతుంది.

Advertisement

అన్నీ దారులు మూసుకుపోయినా, ఏదో ఓ మూలన మరో తలుపు తెరచుకునే ఉంటుంది.ఇలాంటి వాటికి ఈ వీడియో ఉదాహరణగా నిలుస్తోంది.

సమస్య ఒక దారిలో పరిష్కారం కాకపోతే.మరో దారిలో వెళ్తే పరిష్కారం కావొచ్చు అనే దానిని వివరించి చెబుతోంది.

అసలు ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.ఓ చిన్నారి ఆడుకుంటూ.

ఐరన్ రాడ్డుల మధ్య తల దూర్చుతాడు.తలను వెనక్కు తీసుకోలేక పోతాడు.

త్రివిక్రమ్ కథ చెప్తుంటే పవన్ కల్యాణ్ నిద్ర పోతే, మహేష్ బాబు లేచి వెల్లిపోయారట
సోదరి, బావ కలిసి చేతబడి చేశారంటూ పోలీస్ కంప్లైంట్.. అధికారులు షాక్..??

అక్కడికి తండ్రి వచ్చి బాలుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు.ఇనుప రాడ్డులను వంచి తలను బయటకు తీయడానికి ట్రై చేస్తాడు.

Advertisement

కానీ ఆ ఇనుప చువ్వలు ఏమాత్రం కూడా వంగవు.తల బలాన్ని అంతా ఉపయోగిస్తాడు.

కానీ ప్రయోజనం ఉండదు.చాలా ట్రై చేసిన తర్వాత వేరే దారి వెతుకుదామని అక్కడి నుండి వెళ్లిపోతాడు.

బాబు ఒక్కడే అక్కడ మిగులుతాడు.తనను తాను ఎలా బయట పడాలా అని తీవ్రంగా ఆలోచించగా.ఓ మెరుపు లాంటి ఆలోచన తడుతుంది.

ఊచల నుండి తలను తీయకుండా, శరీరాన్ని తీయాలని అనుకుంటాడు.అప్పుడు బాడీ ఈజీగా బయటకు వచ్చేస్తుంది.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

తాజా వార్తలు