2024 దీపావళి పండగ బ్లాక్ బస్టర్ హిట్ ఏది.. ఈ ప్రశ్నకు క్లారిటీ వచ్చేసిందిగా!

దీపావళి పండుగ అయిపోయింది.ఇక దీవాలి సందర్భంగా బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చాలా సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే.

అందులో కొన్ని సినిమాలు మంచి సక్సెస్ ను సాధించగా మరికొన్ని ఆశించిన విధంగా ఫలితాలను రాబట్ట లేకపోయాయి.క, లక్కీ భాస్కర్, అమరన్ (ka movie , amaran, lucky bhaskar)లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన విషయం తెలిసిందే.

మరి ఈ దీపావళికి ఎవరు సక్సెస్ గా నిలిచారు అన్న విషయానికి వస్తే.ముందుగా లక్కీ భాస్కర్ సినిమా విషయానికి వస్తే.

పాజిటివ్ రివ్యూలు, బాగుందనే పబ్లిక్ టాక్ తో లాంగ్ రన్ ని టార్గెట్ పెట్టుకున్న వైనం వసూళ్లలో స్పష్టమవుతోంది.

Advertisement

వారాంతం బుకింగ్స్ బాగుండటం శుభసూచకం.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ ని తెచ్చుకుంది.నిర్మాత నాగవంశీ చెప్పినట్టు పోటీ వల్ల రెవిన్యూ అందరికీ షేర్ అవుతోంది కనక ఏదో మాస్ హీరో సినిమాలా తొలి రెండు రోజుల వసూళ్లను కొలమానంగా పెట్టుకోవద్దంటూ చెప్పడం వాస్తవమేనని చెప్పాలి.

కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరోగా నటించిన క మూవీ ఫ్లాపుల ప్రవాహానికి బ్రేక్ వేసింది.వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ దాటిపోవడం ఖాయమనే అంచనా నిజం కావడం ఖాయం.

ఇక షాకింగ్ హిట్ గా అమరన్.గురించి ట్రేడ్ మాట్లాడకుంటూనే ఉంది.

ఏదో మొదటి రోజు ఒక మోస్తరుగా ఉంటే గొప్పనుకుంటే ఏకంగా మూడో రోజుకు మరింత బలంగా మారిపోయి జనాన్ని ఆకట్టుకుంటోంది.పూర్తిగా ఫెయిలైన క్యాటగిరీ లో ప్రశాంత్ నీల్ కథ అందించిన బఘీరా ఒకటే నిలిచింది.టాలీవుడ్ లో విడుదలైన మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద హిట్టు టాక్ ని సొంతం చేసుకున్నాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
గుండెను తడిమిన పునీత్ పెయింటింగ్.. గీసింది ఎవరంటే...

దేనికి తగ్గట్టు ఆ సినిమాలు కలెక్షన్ల పరంగా సునామీలను సృష్టిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు