పవన్‌ గురించి ఉన్నదేగా మాట్లాడింది

ప్రభుత్వ స్కూల్స్‌లో ఇంగ్లీష్‌ మీడియం చదువులు అంటూ జగన్‌ ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవోకు వ్యతిరేకంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడటంతో వైకాపా నాయకులు సీరియస్‌ అయ్యారు.

ఏకంగా సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌కు ముగ్గురు భార్యలు నలుగురో అయిదుగురో పిల్లలు అంటూ వ్యాఖ్యలు చేశాడు.

సీఎం వ్యాఖ్యలపై జనసేన పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఒక ముఖ్యమంత్రి స్థాయి మాటలేనా అవి అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో జగన్‌ వ్యాఖ్యలపై మంత్రి బొత్స స్పందించాడు.పవన్‌ కళ్యాణ్‌ గురించి సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలను తాను పూర్తిగా సమర్ధిస్తున్నట్లుగా ప్రకటించాడు.

పవన్‌ గురించి ఉన్న విషయాన్ని జగన్‌ చెప్పాడని, అందులో కొత్తేముంది అంటూ ప్రశ్నించాడు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌ గురించిన ఆ విషయాలు ప్రతి ఒక్కరికి తెలుసు.

Advertisement

దాన్నే సీఎం గారు చెప్పారు.దాన్ని పెద్దగా చేసి చూడటంను బొత్స తప్పుబట్టాడు.

అసలు జగన్‌ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదు అంటూ ఈ సందర్బంగా బొత్స చెప్పుకొచ్చాడు.

Advertisement

తాజా వార్తలు