నాని సినిమాపై కోర్టుకెక్కిన నటి.. ఎందుకంటే..?

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా దిల్ రాజు నిర్మాతగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో వీ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

గతేడాది లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతబడటంతో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఈ సినిమాలో నటించగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.అయితే తాజాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది.

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సినిమాలతో గుర్తింపును సంపాదించుకున్న సాక్షి మాలిక్ వీ సినిమాలో అనుమతి లేకుండా తన ఫోటోను ఉపయోగించారని కోర్టు మెట్లెక్కింది.మూవీలో వేశ్య ఫోటోను మరో వ్యక్తికి చూపించే సీన్ లో తన ఫోటోను ఉపయోగించారని బాంబే కోర్టుకు తెలిపింది.

అనుమతి లేకుండా తన ఫోటోను వినియోగించడం వల్ల తన పరువుకు నష్టం కలుగుతుందని సాక్షి మాలిక్ పేర్కొంది.

Actress Sakshi Malik Filed Defamation Case Against V Movie Team, V Movie,actress
Advertisement
Actress Sakshi Malik Filed Defamation Case Against V Movie Team, V Movie,Actress

బాంబే కోర్టు జస్టిస్ పటేల్ సాక్షి ఇమేజ్ ను వినియోగించిన సీన్స్ ను తొలగించి సినిమాను మళ్లీ అప్ లోడ్ చేయాలని సూచనలు చేశారు.నటి ఫోటోను బ్లర్ కూడా చేయవద్దని పూర్తిగా సన్నివేశం తొలగించాలని కోర్టు పేర్కొంది.వీ మూవీని అప్ లోడ్ చేసేముందు సాక్షికి చూపించాలని కోర్టు సూచనలు చేసింది.నటి దాఖలు చేసిన పిటిషన్ పై తదుపరి విచారణ ఈ నెల 8వ తేదీకి వాయిదా పడింది.2017 సంవత్సరంలో ఒక ఫోటోగ్రాఫర్ వీ మూవీలో ఉపయోగించిన సాక్షి మాలిక్ ఫోటోను తీశారని సమాచారం.ఆమె ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుంచి వీ మూవీ మేకర్స్ ఈ ఫోటోను తీసుకున్నారని తెలిసింది.

ఈ వివాదంపై వీ మూవీ హీరోలు నాని, సుధీర్ బాబు లేదా ఆ సినిమా నిర్మాత దిల్ రాజు స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు