పుష్ప 2 ఛాన్స్ కోసం బాలీవుడ్ స్టార్ వెయిటింగ్..!

బాలీవుడ్ విలక్షణ నటుల్లో మనోజ్ బాజ్ పాయి ఒకరు.సినిమాలు, వెబ్ సీరీస్ లని తేడా లేకుండా ఆయన సత్తా చాటుతూ వస్తున్నారు.

ఆయన చేసిన ఫ్యామిలీ మెన్ వెబ్ సీరీస్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.అలాంటి బాలీవుడ్ స్టార్ రీసెంట్ గా పుష్ప సినిమా చూసి ఫిదా అయ్యారని తెలుస్తుంది.

సినిమాలో ప్రతి ఫ్రేం ని ఎంజాయ్ చేశానని ఆయన చెప్పుకొచ్చారు.అల్లు అర్జున్ మాస్ యాటిట్యూడ్.

సుకుమార్ డైరక్షన్ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాయని ఆయన అన్నారు.ఇక ఛాన్స్ వస్తే పుష్ప 2లో తాను కూడా భాగమవుతా అని అంటున్నారు మనోజ్ బాజ్ పాయి.

Advertisement

పుష్ప 2లో చాలామంది నటులు అవసరం ఉంటారని ఇదివరకే చెప్పారు.పుష్ప పార్ట్ 1 చివర్లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా షెఖావత్ గా మళయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ మెప్పించాడు.

పుష్ప 2లో అతని పాత్ర అదరగొట్టేస్తుందని అంటున్నారు.అయితే మనోజ్ కూడా తనకు పుష్ప 2లో ఒక ఛాన్స్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నారట.

ఆ సినిమాలో తనని తీసుకోవాలని చిత్రయూనిట్ కి హింట్ ఇస్తున్నారట.

పుష్ప 2 షూటింగ్ విషయానికి వస్తే లొకేషన్స్ ఇప్పటికే ఫైనల్ అవగా ఆగష్టులో పార్ట్ 2 సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.పుష్ప పార్ట్ 2లోనే అసలు సినిమా ఉంటుందని అంటున్నారు.తెలుగు ఆడియెన్స్ కి ఈక్వల్ గా పుష్ప సినిమాని బాలీవుడ్ ఆడియెన్స్ నచ్చారు.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

అక్కడ పుష్ప కి ఊర మాస్ ఫాలోయింగ్ ఏర్పడింది.పుష్ప 2కి కూడా బాలీవుడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి.పుష్ప 2లో రష్మికతో పాటుగా మరో హీరోయిన్ కూడా ఉంటుందని తెలుస్తుంది. 2023 సమ్మర్ లో పుష్ప 2ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Advertisement

తాజా వార్తలు