బాలీవుడ్ ఆడియెన్స్ కి ఆమీర్ బోర్ కొట్టేశాడా..!

కొవిడ్ తర్వాత తెలుగు బాక్సాఫీస్ కళకళలాడుతుండగా బాలీవుడ్ మాత్రం ఆ దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదని చెప్పొచ్చు.

అయితే విచిత్రం ఏంటంటే కేవలం హిందీ సినిమాలకే ఆ ఎఫెక్ట్ పడుతుంది.

తెలుగు సినిమాలు హిందీలో డబ్ అయ్యి మంచి ఫలితాలు అందుకుంటున్నాయి.బాలీవుడ్ సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడుతున్నాయి.

అయితే మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ మీద చాలా హోప్స్ పెట్టుకుంది బాలీవుడ్.ఆయన లాల్ సింగ్ చడ్డాతో అయినా బాలీవుడ్ సినిమాలకు ఊపొస్తుందని భావించారు.

కానీ ఆమీర్ సినిమా కూడా చేతులెత్తేసింది.ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన లాల్ సింగ్ చడ్డా సినిమా హిందీలో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేశారు.

Advertisement

ఇక్కడ అదే రిజల్ట్ అందుకుంది.అయితే బాలీవుడ్ ఆడియెన్స్ కి ఆమీర్ ఖాన్ బోర్ కొట్టేశాడని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఆయన ఎంచుకునే కథలు వెరైటీగా ఉంటున్నా ఆమీర్ మాత్రం కొత్తగా కనిపించట్లేదు అన్న భావన కలుగుతుంది.అందుకే ఆమీర్ ఖాన్ ఆడియెన్స్ కి బోర్ కొట్టేశాడని కామెంట్ చేస్తున్నారు.

 ఈ సినిమా టార్గెట్ మిస్సైనా ఆమీర్ నెక్స్ట్ సినిమా మాత్రం బాక్సాఫీస్ పై సందడి చేస్తుందని ఆమీర్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి
Advertisement

తాజా వార్తలు