కూరగాయల్లా బేరాలు ఆడుతుంటారు.. వైరల్ అవుతున్న హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

సోనాక్షి సిన్హా.( Sonakshi sinha) ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి అలాగే బాలీవుడ్ సినిమాలు తరచూ ఫాలో అయ్యే వారికి ఈ ముద్దుగుమ్మ సుపరిచితమే.సౌత్ సినిమాలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

రజినీకాంత్( Rajinikanth) హీరోగా నటించిన లింగ సినిమాలో( Lingaa ) హీరోయిన్ గా చేసింది సోనాక్షి సిన్హా.ఈ అమ్మడు ఆచితూచి సినిమాలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది.

ప్రస్తుతం కేవలం సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తోంది సోనాక్షి సిన్హా.

Advertisement

ఇటీవల స్టార్ డైరెక్టర్ సంజయ్ లీల బన్సాలి దర్శకత్వంలో తెరకెక్కిన హీరమండి: ది డైమండ్ బజార్ అనే సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే.టీటీలో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఈ వెబ్ సిరీస్ లో చాలా మంది హీరోయిన్స్ నటించారు.

లాహోర్ లోని ఒక రెడ్ లైట్ ఏరియా ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.అలాగే ఇది స్వతంత్రం కంటే ముందు జరిగిన కథ.ఈ వెబ్ సిరీస్ లో సోనాక్షి తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది.కాగా తాజాగా సోనాక్షి సిన్హా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

సల్మాన్ ఖాన్ ( Salman Khan )సినిమాతో సోనాక్షి సిన్హా సినీ పరిశ్రమకు పరిచయమైంది.ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ఆ సినిమాలు ఈమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టలేకపోయాయి.

నేను ఎంత కష్టపడినా కొన్నిసార్లు సినిమా విజయం సాధించలేదు.తర్వాత పాత్రల ఎంపికను పూర్తిగా మార్చుకున్నాను.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

కొన్ని విజయవంతం అయ్యాయి.అందులో కొన్ని విజయవంతం కాలేదు.

Advertisement

ఆర్టిస్ట్‌గా ఆ సినిమాలను ఆస్వాదించాను.ఈ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కాకపోవచ్చు.

అయితే టీమ్‌ లోని కొందరితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది.అయినా ఎందుకు విజయం సాధించడం లేదని నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది సోనాక్షి.

సినిమా బాక్సాఫీస్ భవిష్యత్తు నా చేతుల్లో లేదు.అది నాకు కూడా తెలుసు.

నటిగా మీరు మీ వంతు ప్రయత్నం చేయాలి.నా నటనకు ఎప్పుడూ ప్రశంసలు వచ్చేవి.నేను అభివృద్ధి చెందుతున్నప్పుడు, నేను ఇష్టపడేదాన్ని చేస్తూనే ఉన్నాను.

నిర్మాతలు మీకు ఫోన్ చేస్తే అన్నీ చర్చిస్తారు.అందరూ నటీమణులకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటారు.

అయితే డబ్బు విషయంలో మాత్రం రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని పట్టుపడతారు.ఎక్కువగా బేరాలు ఆడుతుంటారు అని చెప్పుకొచ్చింది సోనాక్షి సిన్హా.

ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజా వార్తలు