Ranveer Singh Deepika Padukone : నా భార్య లాంటి కూతురే కావాలని ఉంది… రణవీర్ సింగ్ కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో రణవీర్ సింగ్ ( Ranveer Singh ) దీపికా పదుకొనే దంపతుల జంట ఒకటి అని చెప్పాలి.వీరిద్దరూ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు.

2018 వ సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.దీపిక పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇటీవల వరుస హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె అభిమానులకు శుభవార్త చెప్పారు.

దీపిక పదుకొనే( Deepika Padukone ) 2018 వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు తన కెరియర్ పైన ఫోకస్ పెట్టారు.అయితే ప్రస్తుతం పిల్లల గురించి ఆలోచించి వీరు తమ మొదటి బిడ్డకు స్వాగతం పలకబోతున్నారు.ఈ క్రమంలోనే తన ప్రెగ్నెన్సీ ( Pregnancy ) విషయాన్ని దీపిక పదుకొనే అధికారికంగా వెల్లడించారు.

Advertisement

తమ బేబీ ఈ ఏడాది సెప్టెంబర్ లో రాబోతుంది అంటూ దీపిక చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారడంతో ఎంతోమంది సెలబ్రిటీలు అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇకపోతే తాజాగా రణవీర్ సింగ్ గతంలో చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ అవుతున్నాయి.దీపికా ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తెలియజేయడంతో గత కొద్దిరోజుల క్రితం రణవీర్ సింగ్ పిల్లల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈయన పిల్లల గురించి మాట్లాడుతూ నాకు కనుక పిల్లలు పుడితే అమ్మాయి ( Baby Girl ) పుట్టాలని ఆ అమ్మాయి అచ్చం నా భార్య దీపిక లాగా అందంగా ఉండాలని తెలిపారు.

నేను ప్రతిరోజు దీపిక చిన్నప్పటి ఫోటోలను( Deepika Childhood Photos ) చూస్తూ ఉంటాను ఆమె ఒక దేవతల ఉందని అందుకే నాకు కూడా అలాంటి కూతురే పుట్టాలని ఈయన కోరుకున్నారు.ఇక నాకు కూతురు పుడితే కనుక శౌర్య వీర్ సింగ్ అనే పేరు కూడా పెడతాను అంటూ రణవీర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

విష్ణువు వరాహవతారం ఎత్తడానికి గల కారణం ఇదే..!
Advertisement

తాజా వార్తలు