యూపీలో పడ‌వ ప్ర‌మాదం..20 మంది గ‌ల్లంతు

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జ‌రిగింది.బాందాలోని యమునా నదిలో పడవ ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పింది.

దీంతో ఒక వైపుకు వాలిపోయింది.పడవలో ఉన్న ప్రయాణికులు చూస్తుండగానే నీళ్లలోనికి జారీపోయారు.

పడవ ప్రమాదంలో 20 మంది వరకు ప్రయాణికులు గల్లంతైయినట్లు అధికారులు గుర్తించారు.ఇప్ప‌టివ‌ర‌కు న‌లుగురి మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు తీశారు.

ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ప‌డ‌వ‌లో సుమారు 50 మంది ప్ర‌యాణికులు ఉన్న‌ట్లు తెలుస్తోంది.స్థానిక అధికారుల ద్వారా స‌మాచారం అందుకున్న రెస్క్యూ టీం మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

Advertisement