Gram Cultivation : రబీలో మినుము పంటను సాగు చేస్తే పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు..!

మినుము పంట( Gram Cultivation ) ఎక్కువగా అంతరపంటగా లేదంటే రబీలో రెండవ పంటగా సాగు అవుతోంది.

మినుము పంటను తొలకరిలోను, రబీలోను, వేసవిలో వరి కోతల తర్వాత పండించవచ్చు.

మినుము పంటను ఖరీఫ్ లో సాగు చేయాలనుకుంటే.జూన్ లేదా జూలైలో విత్తుకోవాలి.

రబీలో సాగు చేయాలనుకుంటే.అక్టోబర్ నెలలో విత్తుకోవాలి.

వరి పంట కోసిన తర్వాత అయితే నవంబర్-డిసెంబర్ నెలలో విత్తుకోవాలి.వేసవిలో సాగు చేయాలనుకుంటే ఫిబ్రవరి-మార్చిలో విత్తుకోవాలి.

Advertisement

రబీలో మినుము పంటను వరి మాగాణి పొలాల్లో సాగు చేస్తే మంచి దిగుబడి పొందవచ్చు.వరి పంట కోయడానికి రెండు లేదా మూడు రోజుల ముందు మినుము విత్తనాన్ని వరి పొలంలో వెదజల్లాలి.

ఈ విధంగా చల్లిన విత్తనం మొలకెత్తిన భూమిలోని మిగిలిన తేమను సారాన్ని ఉపయోగించుకుని పెరుగుతుంది.

అయితే ఇలా సాగు చేస్తే కలుపు సమస్య( Weeds ) కాస్త అధికంగా ఉంటుంది.కాబట్టి కూలీలతో కలుపును తీయించాలి.మినుము పంటకు ఒక ఎకరాకు రెండు టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల భాస్వరం, 8 కిలోల నత్రజని ఎరువులు అవసరం.

అదే వరి పంటలో సాగు చేస్తే ఎలాంటి ఎరువులు వాడాల్సిన అవసరం ఉండదు.నీటి తడుల విషయానికి వస్తే నాటిన 30 రోజులలో ఒకసారి, 55 రోజుల తర్వాత మరోసారి నీటి తడి అందిస్తే సరిపోతుంది.

అల్లంతో అధిక హెయిర్ ఫాల్ పరార్.. ఎలా వాడాలంటే?
బతికి ఉన్న పీతను కరకరా నమిలేసి తిన్న మహిళ.. వీడియో వైరల్..

మినుము పంట సాగకు దాదాపుగా అన్ని రకాల నేలలు అనుకూలంగానే ఉంటాయి. విత్తనాలను( Gram Seeds ) ముందుగా విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల నేల నుంచి వివిధ రకాల తెగుళ్లు ఆశించే అవకాశం తక్కువ.ఒక కిలో విత్తనాలను 30 గ్రాముల కార్బోసల్ఫాన్ లేదంటే 25 గ్రాముల థైరంతో విత్తన శుద్ధి చేసుకోవాలి.

Advertisement

పంట చేతికి వచ్చాక మినుము మొక్కలను మొదళ్ళ వరకు కోసి, బాగా ఎండిన తర్వాత పంటను నిల్వ చేసుకోవాలి.

తాజా వార్తలు