ప్ర‌శ్నించేందుకే బీజేవైఎం యువ సంఘ‌ర్ష‌ణ యాత్ర‌..!

ఏపీలో అభివృద్ధి జ‌ర‌గ‌డం లేద‌ని బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు ఆరోపించారు.దీనిపై ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించేందుకే బీజేవైఎం ఆధ్వ‌ర్యంలో యువ సంఘ‌ర్ష‌ణ యాత్ర చేప‌ట్టినట్టు తెలిపారు.

అంతేకాకుండా స‌ర్కార్ ఎలా ప‌ని చేయాల‌నే దాన్ని కూడా వివ‌రిస్తామ‌ని వెల్ల‌డించారు.రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం రూ.వేల కోట్లు ఇస్తుంద‌న్నారు.పెట్రోలియం కాంప్లెక్స్ వ‌ల్ల నాలుగు ల‌క్ష‌ల మందికి ఉపాధి దొరుకుతుంద‌న్నారు.

కానీ రాష్ట్ర ప్ర‌భుత్వం రెండు ల‌క్ష‌ల మందికి కూడా ఉద్యోగాలు క‌ల్పించ‌లేక‌పోతుంద‌ని విమ‌ర్శించారు.

Advertisement