మునుగోడు పై బీజేపీ టెన్షన్ ! రాజగోపాల్ రెడ్డే కారణం ?

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి జెండా ఎగురవేస్తామనే ధీమా ఆ పార్టీ రాష్ట్ర నాయకులతోపాటు,  అగ్ర నేతలు ఉన్నారు.

అంతకుముందే జరిగిన దుబ్బాక,  హుజురాబాద్ ఎన్నికల్లో బిజెపి ఘనవిజయం సాధించడం,  అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోను బిజెపి ఊహించిన దాని కంటే ఎక్కువ కార్పొరేటర్ లను గెలుచుకోవడం ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్న కమల్ నాధులు మునుగోడు ఉప ఎన్నికల తో పాటు,  రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోను బిజెపి జెండా తెలంగాణలో ఎగురుతుంది అనే నమ్మకం పెట్టుకున్నారు.

  అందుకే సందర్భం వచ్చినప్పుడల్లా టిఆర్ఎస్ కు సవాల్ విసురుతూ ఎన్నికల్లో తేల్చుకుందాం అంటూ ప్రకటనలు చేస్తున్నారు.అయితే హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు.

ఆయనకు వ్యక్తిగతంగా ను ఈ నియోజకవర్గంలో మంచి ఇమేజ్ ఉందని,  తప్పకుండా గెలుస్తారని బిజెపి ఆశలు పెట్టుకుంది.  అందుకే సందర్భం వచ్చినప్పుడల్లా కేంద్ర మంత్రులు , బీజేపీ అగ్ర నేతలు తెలంగాణలో అడుగు పెడుతూ మునుగోడు ఉప ఎన్నికలపై ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఇక ఎన్నికలు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత పెద్ద ఎత్తున కేంద్ర మంత్రులు మునుగోడులో మకాం వేసే ప్లాన్ లో ఉన్నారు.  అయితే ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు బీజేపీ అగ్రనేతలకు ఆందోళన కలిగిస్తోందట.

Advertisement

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరిన తర్వాత పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని ఆశించినా, ఆ స్థాయిలో చేరికలు లేకపోవడం, అలాగే ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాజగోపాల్ రెడ్డిని ప్రజలు వివిధ సమస్యలపై నిలదీస్తూ ఉండడం వంటివి ఇప్పుడు ఇబ్బందికరంగా మారాయి. రాజగోపాల్ రెడ్డి చరిష్మా ఎక్కువగా ఊహించుకున్న బిజెపి అగ్రనేతలు ఇప్పుడు వాస్తవ పరిస్థితి తెలిసి వచ్చేసరికి గెలుపు పై ఆందోళన చెందుతున్నారట. 

దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు దేశవ్యాప్తంగా కీలకంగా ఉన్న 16 మంది వ్యూహకర్తలతో ప్రత్యేకంగా ఒక కమిటీ వేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.రాజగోపాల్ రెడ్డిని ప్రచార బాధ్యతల నుంచి తప్పించి కేవలం అభ్యర్థిగానే ప్రజల్లోకి తీసుకువెళ్లాలని,  మొత్తం వ్యవహారాలన్నిటిని ఈ పదహారు మందితో కూడిన కమిటీని చూసుకుంటుందని బిజెపి అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి తేల్చి చెప్పిందట.

Advertisement