బీజేపీకి ఓటమి నేర్పిన పాఠం !

కర్నాటక ఎన్నికలు బీజేపీని( BJP ) ఎంతగా దెబ్బ తీశాయంటే.ఓటమిపై అధిష్టానం కూడా సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఎందుకంటే కర్నాటక ఎన్నికల్లో గెలుపుపై బీజేపీ మొదటి నుంచి కాన్ఫిడెంట్ గా ఉంటూ వచ్చింది.ఆల్రెడీ రాష్ట్రంలో అధికారంలో ఉండడం అలాగే కేంద్రంలో కూడా బీజేపీదే అధికారం కావడంతో డబుల్ ఇంజన్ సర్కార్( Double engine Sarkar ) సూత్రం గట్టిగా పని చేస్తుందని భావించారు కమలనాథులు.

అంతే కాకుండా కన్నడనాట బీజేపీని ఆదరించే లింగాయత్, ఒక్కలింగ వంటి వర్గాల వారు అధికంగా ఉండడం వారంతా బీజేపీ వెంటే ఉంటారని భావిచడం వంటి కారణాలతో అధికారం తమదే అని భావించారు బీజేపీ నేతలు.

Bjps Defeat Taught A Lesson , Bjp , Karnataka Elections , Congress, Parliamen

తీర ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది.కాంగ్రెస్( Congress ) తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించి అధికారంలోకి రాగా బీజేపీ 66 సీట్లకే పరిమితం అయి డీలా పడింది.నిజానికి ఈ స్థాయి ఓటమిని కమలం పార్టీ అసలు ఊహించి ఉండదనే చెప్పాలి.

Advertisement
BJP's Defeat Taught A Lesson! , BJP , Karnataka Elections , Congress, Parliamen

అయితే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇంతా ఘోర ఓటమి చవి చూడడానికి కారణం ఆ పార్టీ తీసుకున్న కొన్ని నిర్ణయాలే అని విశ్లేషకులు చెబుతున్నారు.ప్రజాబలం ఉన్న చాలమంది నేతలకు సీట్లు ఇవ్వక పోవడం, సీట్లు దక్కని నేతలంతా పార్టీ పై తిరుగుబాటు బావుటా ఎగురవేయడం వంటి కారణాలు బీజేపీ ఓటమికి దారి తీసిన పరిణామాలని కొందరి విశ్లేషకుల అభిప్రాయం.

కాగా ప్రస్తుతం ఒటమి నుంచి గుణపాఠం నెరుచుకున్నట్లే కనిపిస్తోంది.అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం పార్లమెంట్ ఎన్నికల్లో రిపీట్ కాకూడదని పక్కా వ్యూహరచన చేస్తోంది.

Bjps Defeat Taught A Lesson , Bjp , Karnataka Elections , Congress, Parliamen

వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 28 సీట్లను కైవసం చేసుకునే విధంగా ప్రణాళికలు రచిస్తోంది కాషాయ పార్టీ.ఎంపీలుగా సుధీర్ఘకాలం కొనసాగుతూ ప్రజాదరణ లేని నేతలను, అలాగే పార్టీలో క్రియాశీలకంగా లేని ఎంపీలకు ఈసారి టికెట్ ఇవ్వకూడదని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం.ఇప్పటికే అలాంటి నేతలకు సంబంధించి లిస్ట్ కూడా తయారు చేశారట.

వారిలో 13 మంది యాక్టివ్ గా లేరని అలాగే వారికి ప్రజాధరణ కూడా లేదని తేలడంతో అలాంటి వారికి టికెట్ నో ఛాన్స్ అంటోందట బీజేపీ అధిష్టానం.ఇప్పటికే సదానంద గౌడ, రమేశ్ జీగాజినగి, దేవేంద్రప్ప వంటి వారు ఉన్నారట.

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!

ఇక ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాదరణ పుష్కలంగా ఉన్న కొత్త నేతలకె అధిక ప్రదాన్యం ఇచ్చే విధంగా అధిష్టానం ప్రణాళికలు రచిస్తోందట.మరి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులను అధిగమించి వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాషాయ పార్టీ ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు