గేరు మార్చిన బీజేపీ.. పురందేశ్వరి ప్లానే ?

ఏపీలో బీజేపీ కొత్త పంథాలో ముందుకు సాగేందుకు సిద్దమౌతున్నట్లు తెలుస్తోంది.రాష్ట్రంలో పార్టీకి బలం లేనందున ఇతర పార్టీలపై ఆధార పడాల్సి వచ్చేది.

అందుకే జనసేన దోస్తీని బీజేపీ వదలడం లేదు.జనసేన అండతోనే ఏపీలో బలపడాలని బీజేపీ ప్రయత్నిస్తూ వచ్చింది.

అలాగే టీడీపీతో కూడా కలిస్తే బీజేపీకి మరింత బలం పెరుగుతుందని బీజేపీలోని కొందరి నేతలు అభిప్రాయ పడుతూ వచ్చారు.అయితే ఇదంతా సోము వీర్రాజు ( Somu Veerraju )అధ్యక్ష పదవిలో కొనసాగినప్పుడు ఇలాంటి పరిస్థితులు కనిపిస్తూ వచ్చాయి.

కానీ ఇప్పుడు దొరణి నుంచి బీజేపీని బయటకు తెచ్చేందుకు పురందేశ్వరి గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement
BJP With New Strategies? , Daggubati Purandeswari, Ap Politics , Ap Politics, Yc
Bjp With New Strategies , Daggubati Purandeswari, Ap Politics , Ap Politics, Yc

ఆమె ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్ష బాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.పురందేశ్వరి బీజేపీ( Daggubati Purandeswari ) చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీలోని లొసుకులను ముందు రూపు మాపే ప్రయత్నం చేస్తున్నారు.

ఇంతవరుకు బీజేపీ ఇతర పార్టీలపై ఆధారపడాల్సి వచ్చింది.కానీ ఇకపై సొంత బలంపైనే బీజేపీ ఆధారపడే విధంగా పురందేశ్వరి ప్లాన్స్ ఉనబోతున్నాయని స్పస్తామౌతోంది.ఇటీవల తొలిసారి పార్టీ నేతలతో సమావేశం నిర్వహించిన పురందేశ్వరి.

ఆ సమావేశంలో కీలకంగా ఈ విషయాలపైనే చర్చించరాట.ఇకపై ఎవరు కూడా బహిరంగంగా పొత్తులపై వ్యాఖ్యానించరాదని, పొత్తుల అంశం జాతీయ నాయకత్వం చూసుకుంటుందని తేల్చి చెప్పారట.

Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !

అంతే కాకుండా గ్రూప్ తగాదాలు ఉంటే బహిరంగ సభల్లో అసలు ప్రస్తావించకూడదని హెచ్చరించరాట.

Bjp With New Strategies , Daggubati Purandeswari, Ap Politics , Ap Politics, Yc
Advertisement

దీన్ని బట్టి చూస్తే పార్టీలో సంస్థాగత మార్పు కోసం పురందేశ్వరి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.అలాగే జనసేన విషయంలో కూడా ఈసారి క్లారిటీతో ఉండే విధంగా పురందేశ్వరి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.జనసేన మిత్రపక్షంగా ఉన్నందున పవన్( Pawan kalyan) తో కలిసి అడుగేయ్యాలని రాష్ట్ర బీజేపీ నేతలకు పురందేశ్వరి స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

సోము వీర్రాజు అధ్యక్షుడిగా ఉన్న టైమ్ లో బీజేపీ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వెళ్ళగక్కారు పవన్.ఈ నేపథ్యంలో గత పరిణామాలను బేరీజు వేసుకొని జనసేన విషయంలో పక్కాగా కలగలుపుగా ఉండాలని పురందేశ్వరి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే పార్టీలోని లొసుగులను రూపుమాపేందుకు పురందేశ్వరి గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు