యూపీ రిజల్ట్ : అదరగొట్టేశావ్  'యోగీ ' !

ఉత్తర ప్రదేశ్ లో మరోసారి బీజేపీ జెండా రెపరెపలాడుతోంది.

ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లు గానే ఉత్తర ప్రదేశ్ లో రెండో సారి బీజేపీ పభుత్వం ఏర్పాటు కాబోతోంది.

దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ప్రచారం అవుతున్న సమయంలోనే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడంతో,  కాంగ్రెస్ తో పాటు మిగిలిన బీజేపీ వ్యతిరేక పార్టీలకు మింగుడు పడని అంశంగా మారింది.ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.

మెజార్టీ స్థానాల్లో బీజేపీ పాగా వేసింది.గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలతో పోల్చుకుంటే కాస్త తక్కువ స్థానాలను గెలుచుకున్న , ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమైంది.

ఉత్తరప్రదేశ్ ఎన్నికలను బీజేపీ అగ్రనేతలంతా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.అతి పెద్ద రాష్ట్రం లో ఉన్న యూపీలో పాగా వేయడం ద్వారా దేశవ్యాప్తంగా ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు అని లెక్కలు వేసుకున్నారు.దీనికి తగ్గట్లుగానే ఎన్నికల ప్రచారం నిర్వహించి ఫలితాలను అనుకూలంగా సాధించడంలో సక్సెస్ అయ్యారు.

Advertisement

అఖిలేష్ నేతృత్వంలోని ఎస్పి కూటమి రెండో స్థానంలో నిలిచింది.ఇక మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.

కాంగ్రెస్ సైతం దాదాపు ఇదే పరిస్థితిని ఎదుర్కొంది.  రెండోసారి యోగి ఆదిత్యనాథ్ కు ముఖ్యమంత్రి పీఠం దక్కబోతోంది.

యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలోని బీజేపీ వైపు మొగ్గు చూపడానికి కారణాలు చాలానే ఉన్నాయి.  అన్ని రంగాల్లోనూ వెనుకబడిన ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత సమూల మార్పులు తీసుకువచ్చింది.

పేదరిక నిర్మూలనకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేశారు .వేల కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించారు.శాంతిభద్రతలను అదుపుచేయడంలోనూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సక్సెస్ అవ్వడం ఇవన్నీ ప్రజల్లో బీజేపీపై సానుకూలతను పెంచాయి.ఆ ప్రభావమే ఎన్నికలు స్పష్టంగా కనిపించింది .403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో 273 బీజేపీ గెలుచుకోగా,  ఎస్పి 122, బి ఎస్ పి 5, కాంగ్రెస్ 2, ఇతరులు ఒక స్థానాన్ని గెలుచుకున్నారు.యూపీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఆ పార్టీ అగ్రనేతలు కృషి ఎంత ఉందో అంత కంటే రెట్టింపు స్థాయిలో యోగి ఆదిత్యనాథ్ పైన జనాల్లో నమ్మకం పెరిగింది అనేదానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం.

Advertisement

తాజా వార్తలు