రాహుల్ ని హీరో చేయటమే లక్ష్యంగా బిజెపి పని చేస్తుందా?

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది.

ఒకటి తర్వాత ఒకటిగా రాహుల్ గాంధీ( Rahul Gandhi )ని ఇబ్బంది పెట్టే చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల్లో ఆయనకు సానుభూతిని పెంచే కార్యక్రమం బిజెపి ( BJP )నిరాటంకంగా చేస్తుంది .

ఇప్పటికే కోర్టు తీర్పును సాకు గా చూపించి రాహుల్ ని అనర్హత వేటుకు గురి చేసిన ప్రభుత్వం ఇప్పుడు అదికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇచ్చింది .ఏప్రిల్ 23వ తారీఖు వరకు గడువు ఇచ్చింది .సాదరణం గా గడువు ముగిసిన ప్రజా ప్రతినిదులకు 6 నెలల సమయం ఇస్తారు .రాహుల్ అనర్హత విషయంలోనే పార్లమెంట్ కమిటీ తొందర పడింది .

Bjp Projecting Rahul As A Hero By Their Actions, Rahul ,bjp, Rahul Gandhi, Congr

అని వార్తలు వినిపిస్తున్న వేళ ఇప్పుడు బంగ్లా ఖాళీ చేయడానికి కూడా అత్యంత తక్కువ సమయం ఇవ్వడం చూస్తుంటే ఇది కావాలని రాహుల్ ఇమేజ్ ని పెంచడానికి తద్వారా కాంగ్రెస్ పార్టీ( Congress party )ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి బిజెపి ఏమైనా ప్రయత్నిస్తుందా అన్న విచిత్రమైన అనుమానాలు కలుగుతున్నాయి.మంత్రి పదవి గడువు ముగిసిన తర్వాత కూడా సంవత్సరాల తరబడి తమకు కేటాయించిన బంగ్లాలు ఖాళీ చేయని మాజీల సంఖ్య చాంతాడoతా ఉంది .అలాంటి వారి విషయంలో నోరు మెదపని కమిటీ యుద్ధ ప్రాతిపదికన రాహుల్ పై చర్యలు తీసుకోవడం చూస్తుంటే ఇది కచ్చితంగా కక్ష సాధింపు దోరణే అన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

Bjp Projecting Rahul As A Hero By Their Actions, Rahul ,bjp, Rahul Gandhi, Congr

ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తున్నా , కోర్టులకు ఎక్కిమరి కేసులు పెడుతున్నా కూడా తగ్గిదేలే అంటున్న కేంద్ర ప్రభుత్వ ( Central Govt )ధోరణి నియంతృత్వ విధానాన్ని తలపిస్తుందని ప్రజాస్వామ్యవాదులు కూడా అభిప్రాయపడుతున్నారు.ఉరిశిక్ష పడిన ఖైదీలకు కూడా ఆ శిక్ష అమలకు దాన్ని కోర్టుల్లో సవాలు చేయడానికి కావలసినంత సమయం ఇస్తున్నారు.రాహుల్ విషయం లో మాత్రం కేంద్ర ప్రభుత్వం పరిణామాలను జెట్ స్పీడ్ లో పరిగెత్తిస్తుంది.

Advertisement
BJP Projecting Rahul As A Hero By Their Actions, Rahul ,BJP, Rahul Gandhi, Congr

ఈ స్థాయిలో రాహుల్ వెంటపడి సాధించేది ఏంటో బిజెపి అధినాయకత్వానికే తెలియాలి .ఇలా రాహుల్ పై తీసుకున్న చర్యల పై సామాన్య జనంలో కూడా విమర్శలు వస్తున్న వేళ ప్రజాభిప్రాయాన్ని లెక్కలోకి తీసుకొని దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో బిజెపి తగిన మూల్యం చెల్లిస్తుంది అన్న అంచనాలు వినిపిస్తున్నాయి .

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు