జగన్‌కు షాకిచ్చిన జీవీఎల్‌ నరసింహారావు

ఆంధ్రప్రదేశ్‌లో మొదటి నుంచీ జగన్‌ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు ఆయనకు ఇబ్బందులు తెచ్చి పెడుతూనే ఉన్నాయి.

పోలవరం రివర్స్‌ టెండరింగ్‌, పీపీఏల రద్దు విషయంలో కేంద్రం కూడా జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

అప్పటి వరకూ వైసీపీపై పెద్దగా విమర్శలు గుప్పించని బీజేపీ నాయకులు.ఆ తర్వాత ఏ చిన్న అంశం దొరికినా జగన్‌ సర్కార్‌తో ఆడుకుంటున్నారు.

బీజేపీ ప్రధాన ఆయుధమైన హిందుత్వ అంశాన్ని కూడా జగన్‌పైకి సంధించారు.తాజాగా ఇంగ్లిష్‌ మీడియం విషయంలో ఆయనను మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరిసింహారావు ఇదే అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావించారు.

మాతృభాషను బతికించేలా ఏపీ ప్రభుత్వానికి సూచనలు చేయాలని ఆయన సభాముఖంగా కోరారు.తెలుగులో చదివిన వాళ్లు కూడా ఆ తర్వాత ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సంపాదించిన విషయాన్ని ఈ సందర్భంగా జీవీఎల్‌ గుర్తు చేశారు.

Advertisement

ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడాన్ని తప్పుబట్టకపోయినా.తెలుగు మీడియం లేకుండా చేయడాన్ని మాత్రం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

టీడీపీ ఎంపీ కనకమేడల కూడా ఇదే అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తారు.

ఈ మధ్య ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన మన్‌కీ బాత్‌లో ప్రత్యేకంగా మాతృభాష గొప్పతనాన్ని వివరించిన సంగతి తెలిసిందే.అంతేకాదు ఈ ఇంగ్లిస్‌ మీడియం విషయంలో జగన్‌ సర్కార్‌ను ఇబ్బంది పెట్టడానికి బీజేపీ అన్ని రకాలుగా సిద్ధమవుతోంది.రాజ్యాంగంలో మాతృభాష రక్షణకు సంబంధించిన అంశాలు ఉన్నాయన్న విషయాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తెస్తోంది.

తెలుగు మీడియాన్ని రద్దు చేయడం కుదరదన్న వాదనను బలంగా వినిపిస్తోంది.

మూసీ యుద్ధం..  రేవంత్ వర్సెస్ ఈటెల 
Advertisement

తాజా వార్తలు