Tarun Chugh BJP: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆ ముగ్గురు సీఎంల పాత్ర అంటూ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!!

దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే.

రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ కేసుకు సంబంధించి పలువురు ప్రజాప్రతినిధుల పేర్లు తెరపైకి వస్తున్నాయి.

అంతేకాదు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు సిబిఐ నోటీసులు జారీ చేయడం జరిగింది.ఈ క్రమంలో ఆమె ఈనెల ఆరవ తారీకు హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నారు.

ఇలాంటి తరుణంలో తెలంగాణ బీజేపీ ఇన్చార్జి తరుణ్ చుగ్ ఈ మొత్తం వ్యవహారం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఢిల్లీ లిక్కర్ స్కాం కుంభకోణంలో తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రుల పాత్ర ఉందని ఆరోపించారు.

ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం కుంభకోణంలో లోతైన దర్యాప్తు జరగాలని కోరారు.చట్టం ముందు అందరూ సమానమే.

Advertisement

ఉన్నత కుటుంబంలో పుట్టినంత మాత్రాన చట్టానికి ఎవరూ అతీతులు కారని వ్యాఖ్యానించారు.కుటుంబ పాలనలో అవినీతికి ఇదొక నిదర్శనమని మండిపడ్డారు.

ఇక ఇదే కేసుకు సంబంధించి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తమ ఫోన్లను ధ్వంసం చేశారని తెలిపారు.

Advertisement