జగన్ కు కేంద్రం అలా చెప్పిందా ? వీరి పదవులు పోవడంలేదా ?

ఏపీ ప్రభుత్వానికి కి కేంద్ర అధికార పార్టీ బిజెపి చిన్న ఝలక్ ఇచ్చింది.

ఏపీ శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో, ఏపీ అధికార పార్టీ వైసిపి తీసుకునే ప్రతి నిర్ణయం శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటూ వస్తోంది.

జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానులు, సిఆర్డిఏ రద్దు తదితర విషయాల్లో వైసిపి నిర్ణయాలను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో అడ్డుకుంటున్నారు.ఈ వ్యవహారం వైసీపీ ప్రభుత్వానికి చికాకు కలిగిస్తోంది.

ఈ నేపథ్యంలోనే శాసనమండలి రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం శాసన మండలి రద్దు వ్యవహారం కేంద్రం పరిధిలో ఉంది.

శాసనమండలిని రద్దు చేస్తుంది అని వైసిపి చాలానే ఆశలు పెట్టుకుంది.ఇప్పుడు కేంద్రం ఏపీ శాసనమండలిని రద్దు చేసే విషయంలో వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ మేరకు జగన్ కు కేంద్ర బీజేపీ పెద్దల నుంచి సమాచారం అందడమే కాకుండా ఓ సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.శాసనమండలిని రద్దు చేసే అవకాశం ఇప్పట్లో లేదని, కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను మీ దారిలోకి తెచ్చుకోవాలంటూ సూచించినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు జగన్ కూడా కేంద్రం శాసనమండలిని రద్దు అయ్యే అవకాశం లేదు అనే విషయం జగన్ కు కూడా క్లారిటీ వచ్చినట్టు సమాచారం.అందుకే టిడిపి ఎమ్మెల్సీలను తమ దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏపీ శాసనమండలి లో ప్రస్తుతం 58 మంది సభ్యులు ఉన్నారు.వీరిలో 26 మంది టీడీపీ ఎమ్మెల్సీలు.

వీరిలో ఇప్పటికే ముగ్గురు వైసీపీ గూటికి చేరారు.శాసనమండలి రద్దు చేస్తున్నట్లు జగన్ ప్రకటించిన తర్వాత ఎమ్మెల్సీలు వైసీపీ లోకి వచ్చి చేరారు.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 

తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ యామిని బాల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.మరో రెండు సంవత్సరాల్లో ఏపీ శాసనమండలి లో వైసీపీ బలం మరింతగా పెరుగుతుంది దీంతో ఇంత హడావిడిగా శాసనమండలిని రద్దు చేసే కంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలను మీ దారిలోకి తెచ్చుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే విషయాన్ని కేంద్ర పెద్దలు జగన్ కు చెప్పినట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దీనిపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.ఎమ్మెల్సీలను తమ దారిలోకి తెచ్చుకునే విధంగా ఆపరేషన్ ఆకర్ష్ జగన్ మొదలుపెట్టారు.

టిడిపి నుంచి వైసిపి లోకి వస్తే ఎటువంటి అవకాశాలు ఇస్తామని విషయాన్ని ముందుగానే చెబుతూ వారిని పార్టీలోకి వచ్చే విధంగా జగన్ పావులు కదుపుతున్నారు.శాసన మండలి రద్దు అవుతుందనే ధీమా తోనే ఎమ్మెల్సీ లు, మంత్రులు అయిన మోపిదేవి వెంకటరమణ పిల్లి సుభాష్ చంద్రబోస్ లను జగన్ రాజ్యసభకు పంపించారు.

ప్రస్తుతం శాసనమండలి రద్దు అయ్యే అవకాశం లేకపోవడంతో ఎమ్యెల్సీలంతా రిలాక్స్ అవుతున్నారట.

తాజా వార్తలు