ప‌వ‌న్‌ను తిట్టిపోస్తున్నా బీజేపీ సైలెంట్‌.. కార‌ణ‌మేంది..?

జ‌న‌సేనా ప‌వ‌న్ వైసీపీ నేత‌ల మ‌ధ్య వివాదం తార‌స్థాయికి చేరింది.చీలికి చీలికి గాలివాన‌గా మారిన‌ట్టుగా సినిమా టికెట్ల వ్యవ‌హారం రాజ‌కీయ దూమ‌రం రేపుతోంది.

వ‌ప‌న్‌పై వైసీపీ నేత‌లు మాట‌ల దాడి చేస్తున్నా మిత్ర ప‌క్షం బీజేపీనాయ‌కులు మాత్రం స్పందించ‌డం లేదు.రాజ‌కీయ విమ‌ర్శ‌లు ప‌క్క‌న పెట్టి సినిమా విష‌యంలో ప‌వ‌న త‌ర‌పున క‌మ‌ల‌నాధులు మాట్లాడ‌క‌పోడం చూస్తే బీజేపీ నేత‌లు ప‌వ‌న్ దూరం పెట్టార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

సేవా స‌మ‌ర్ప‌ణ్ పేరిట కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న బీజేపీ నేత‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై మంత్రులు పేర్నినాని, ఇత‌ర వైసీపీ నేత‌లు చేసిన వ్యాఖ్య‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు.ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీరాజు.

సోకాపుల విష‌యంలో పేర్ని చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందించ‌క‌పోడం విడ్డూరంగా ఉంది.మ‌రోవైపు ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌తో త‌మ‌కు సంబంధం లేద‌ని ఏపీ,తెలంగాణ ఫిల్మ్ ఛాంబ‌ర్ ప్ర‌క‌టించింది.

Advertisement
BJP Is Silent While Cursing Pawan .. What Is The Reason Pawan Kalyan, Bjp , Ap

రెండు ప్ర‌భుత్వాల మ‌ద్ద‌తు ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి కావాల‌ని పేర్కొంది.ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఇండ‌స్ట్రీని ఇబ్బందిలో ప‌డేసే అవ‌కాశం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

Bjp Is Silent While Cursing Pawan .. What Is The Reason Pawan Kalyan, Bjp , Ap

వ‌ప‌న్ వ్యాఖ్య‌ల‌పై చిన్న న‌టుడు సంపూర్ణేష్ బాబు మాత్ర‌మే స్పందించ‌చారు.కానీ బీజేపీ మాత్రం పెద‌వి విప్ప‌డం లేదు.వ‌ప‌న్‌కు మ‌ద్దుగా మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర నాయ‌కులు ఆస‌క్తి చూప‌డం లేదు.

ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లతో సంబంధం లేదు అన్న‌ట్టుగా రాష్ట్ర నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త విష‌యంలో తాము జ్యోక్యం చేసుకోబోమ‌ని బీజేపీ నేత‌లు గుస‌గుస‌లాడుకుంటున్నారు.

కానీ వైసీపీ నేత‌లు మాత్రం ప‌వ‌న్‌పై విరుచుకుప‌డ్డారు.ఈ ఎపిసోడ్ చూస్తే ప‌వ‌న్ ఒంట‌రి అయ్యార‌ని, త‌న రాజ‌కీయ మిత్రులు కూడా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?

దీంతో బీజీపీ, జ‌న‌సేన మ‌ధ్య మిత్ర బంధం ఉన్న‌ట్టా? లేన‌ట్టా.అనే చ‌ర్చ జ‌రుగుతుంది.

Advertisement

తాజా వార్తలు