కెసీఆర్ విమర్శలతో బీజేపీ ఖుషీ... అసలు కారణం ఇదే

ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో బీజేపీపై ఎంతగా ఆగ్రహం వ్యక్తం చేశారో మనం చూశాం.

అయితే బీజేపీ దగ్గర కేసీఆర్ సంధించిన కొన్ని ప్రశ్నలకు సమాధానం లేకుండా పోయింది.

అయితే ఇది ఒక్క ప్రక్కకు ఉంచితే బీజేపీ కోసమే కేసీఆర్ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారంటే ఇక ఇది బీజేపీ సాధించిన విజయమంటూ బీజేపీ నాయకులు ఖుషీ అవుతున్న పరిస్థితి ఉంది.దీంతో బీజేపీ రాజకీయంగా ఒక మెట్టు ఎక్కిందని బీజేపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ పట్ల కేసీఆర్ లో వణుకు ప్రారంభమైనదని అందుకే అంతగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉందని ఇది బీజేపీ కార్యకర్తల విజయమంటూ సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్న పరిస్థితి ఉంది.

కాని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రజల్లో ఒకింత ఆలోచనలో పడేసిన మాట వాస్తవం.రైతులను రాజకీయంగా వాడుకునేందుకే బీజేపీ చేసిన ఈ వ్యాఖ్యలతో రైతులు వరి పంట వేసి ఇక కొనే పరిస్థితి లేకుంటే అప్పుడు రైతులతో ధర్నా చేయించి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలన్నది బీజేపీ ఉద్దేశ్యమని కేసీఆర్ విమర్శలకు మాత్రం బీజేపీ వద్ద సమాధానం లేనటువంటి పరిస్థితి ఉంది.

Bjp Is Happy With Kcr Criticism ... This Is The Real Reason Telangana Politics,

అయితే బీజేపీ నేతలు మాత్రం చాలా చాకచక్యంగా కేసీఆర్ విమర్శల పట్ల స్పందించకుండా కేసీఆర్ బీజేపీ గురించి మాట్లాడడమే ఒక పెద్ద విషయమన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు.ఏది ఏమైనా కేసీఆర్ వేసిన బాణం బీజేపీకి తమ భవిష్యత్తును కళ్ళకు కట్టినట్లు చూపించారని టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.మరి బీజేపీ కేసీఆర్ చేసిన ఈ కామెంట్స్ పై ఆచితూచి స్పందించే అవకాశముంది.

Advertisement
BJP Is Happy With KCR Criticism ... This Is The Real Reason Telangana Politics,

ఎందుకంటే ప్రజల దృష్టిలో దోషిగా మిగిలిపోయే అవకాశం ఉంది.ఇక కేసీఆర్ ఈ ఒక్క విషయంతో బీజేపీని ముప్పుతిప్పలు పెడతాడనడంలో ఎటువంటి సందేహం లేదు.

వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?
Advertisement

తాజా వార్తలు