తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లాయి.. కేటీఆర్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లాయని చెప్పారు.

వడ్లు కొనమంటే నూకలు తినమన్నది కేంద్రమే కదా అని ప్రశ్నించారు.అయితే తెలంగాణ ప్రజలు బీజేపీని నమ్మరని మంత్రి కేటీఆర్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ కుటుంబ సభ్యుడేనని పేర్కొన్నారు.రుణమాఫీ పేరుతో కేసీఆర్ మోసం చేశారనడం సరికాదని కేటీఆర్ అన్నారు.

ఈ క్రమంలోనే రుణమాఫీపై తన వ్యాఖ్యలను మోదీ ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు.అనంతరం దేశంలో ఎక్కడైనా రైతులకు కేంద్రం రుణమాఫీ చేసిందా అని ప్రశ్నించారు.

Advertisement

మోదీ ఎన్ని అబద్ధాలు చెప్పినా బీజేపీకి డిపాజిట్లు కూడా రావని తెలిపారు.

Hair Fall : హెయిర్ ఫాల్ కి బెస్ట్ సొల్యూషన్.. ఒక్కసారి దీన్ని ట్రై చేశారంటే జుట్టు ఊడమన్నా ఊడదు!
Advertisement

తాజా వార్తలు