పవన్ వ్యూహం.. రూటు మార్చిన బీజేపీ !

ఏపీలో జనసేన బీజేపీ పొత్తులో( Janasena BJP ) ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ రెండు పార్టీల పొత్తును అటు పవన్ మరియు ఇటు కమలనాథులు కూడా స్వాగతిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీలో నిలవలనేది కాషాయ పార్టీ ప్రణాళిక.అయితే బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్ళే విషయంలో జనసేన ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు.

అంతే కాకుండా ఇటీవల బీజేపీపై పవన్( Pawan kalyan ) చేసిన వ్యాఖ్యలు కొత్త అనుమానాలకు తావిచ్చాయి.బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తే పొత్తు నుంచి బయటకు వస్తామని పవన్ గట్టిగానే హెచ్చరించారు.

అదే టైమ్ లో తాము టీడీపీతో కలిసేందుకు సిద్దమే అనే సంకేతాలను కూడా ఇచ్చారు.దీంతో జనసేనపై ఆధారపడ్డ బీజేపీకి పవన్ చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం మింగుడు పడడం లేదు.

Advertisement

ఇదిలా ఉంచితే తాము టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని ఏపీ కమలనాథులు పదే పదే చెబుతున్నారు.2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసిన తరువాత 2019 ఎన్నికల్లో మూడు పార్టీలు ఎవరికి వారే అన్నట్లుగా కూటమికి స్వస్తి పలికి ఎన్నికల బరిలోకి దిగాయి.ఆ టైమ్ లో చంద్రబాబు ( Chandrababu naidu ) బీజేపీ పై కాస్త గట్టిగానే ఫైర్ అయ్యారు.

మోడీపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు.ఇక అప్పటి నుంచి టీడీపీకి దూరంగానే ఉంటువస్తోంది కాషాయ పార్టీ.

ఈ మద్య కాలంలో కమలం పార్టీతో కలిసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నప్పటికి.బీజేపీ మాత్రం చంద్రబాబును నమ్మడం లేదు.

ఎట్టి పరిస్థితిలోనూ టీడీపీతో కలవకూడదని బీజేపీ అధిష్టానం గట్టిగానే నిర్ణయించుకుంది.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable
సూదిలేని టీకా వచ్చేస్తుంది..... స్వదేశీ తొలి డీఎన్ఏ ఆధారిత టీకా

అయితే పవన్ వేసిన సైలెంట్ వ్యూహంతో ఇప్పుడు బీజేపీ టీడీపీతో తప్పక కలవాల్సిన పరిస్థితి.టీడీపీ, జనసేన కలిస్తే బీజేపీ ఒంటరి పోరుకు సిద్దమవ్వాల్సి ఉంటుంది.అలా చేస్తే బీజేపీ దారుణంగా నష్టపోయే అవకాశం ఉంది.

Advertisement

దాంతో పవన్ కారణంగా బీజేపీ కూడా టీడీపీ తో చేతులు కలపాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇదే విషయాన్ని ఇటీవల ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు చెప్పుకొచ్చారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడం అనివార్యమే అంటూ ఆయన వ్యాఖ్యానించారు.దీంతో 2014 కూటమి రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మొత్తానికి పవన్ వేసిన వ్యూహం కారణంగా టీడీపీతో కలవడానికి ఏమాత్రం ఇష్టపడని బీజేపీ.ఇప్పుడు తప్పక కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తాజా వార్తలు