బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశంలో ప్రజాస్వామ్యం కరువైందని ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహ్మద్ జావేద్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధినాయకత్వం రాహుల్ గాంధీ, సోనియాగాంధీలను దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలతో గత కొన్ని రోజుల నుండి విచారణ పేరిట వేధించడం అప్రజాస్వామికం అని అన్నారు.
దేశానికి స్వాతంత్య్రం తీసుకురవడానికి వారి కుటుంబం ప్రాణాలను సైతం లెక్కచేయలేదని అలాంటి కుటుంబం పై నేడు మోడీ ప్రభుత్వం దాడులకు పూనుకున్నదని ఇది దేశ జాతికే అవమానకరమని అసహనం వ్యక్తం చేశారు.విపరీతంగా ధరలు పెంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రతిపక్షాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు.
గాడ్సే వారసులకు గాంధీ వారసులను వేధించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు.ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రారంభించనున్న జోడో భారత్ పాదయాత్రతో బీజేపీకి వెన్నులో వణుకు పుట్టుకొస్తుందని అందుకే వారి కుటుంబం పై దాడికి పాల్పడుతున్నారని విమర్శించారు.
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో భారతీయ పౌరులను కట్టు బానిసలుగా చూస్తున్న తరుణంలో కాంగ్రెస్ నాయకత్వం దేశానికి స్వాతంత్రం ఎంత అవసరమో.తెలియజేయడానికి నాటి కాంగ్రెస్ మేధావులు మోతీలాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, లాలాలజపతిరాయ్, గోపాలక్రిష్ణ గోఖలే, వల్లభాయ్ పటేల్ వంటి మేధావులు ఆలోచించి నేషనల్ హెరాల్డ్ అనే పత్రికను 1932 అసోసియేట్ జర్నల్స్ పేరిట స్థాపించారు.
ఈ పత్రిక ద్వారా దేశ స్వాతంత్ర ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూ బ్రిటిష్ పాలకుల అరాచకాలను ప్రపంచానికి తెలియజేశారు.స్వాతంత్రం వచ్చిన తరువాత ఈ పత్రిక కొన్ని అనివార్య కారణాల వల్ల నష్టాల్లో కూరుకుపోయింది.
దాన్ని కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అధికారం లో ఉన్నా కూడా ప్రభుత్వ సొమ్మును కాకుండా పార్టీకి సంబంధించిన డబ్బును పత్రికకు లోను గా ఇచ్చి నిలబెట్టింది.నో ప్రాఫిట్ అంటే లాభాలు ఎవరు తీసుకోకుండా పత్రికలో వచ్చిన ఆదాయాన్ని ఎవరు తీసుకోకుండా ఉండేలా షరతులతో యంగ్ ఇండియాకు షేర్లు ఇవ్వడం జరిగింది.
నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన ఆస్తులు ఆస్తుల గానే ఉంటాయి తప్ప ట్రస్ట్ లో ఉన్న వాళ్ళు ఎవరు ఈ ప్రాఫిట్ లో అమ్ముకోవడం గానీ చేయకూడదని ఆనాడే రాసుకున్నారని నేషనల్ హెరాల్డ్ పత్రిక నేపథ్యం వివరించారు.ఈ రోజు బిజెపి ప్రభుత్వం సోనియాగాంధీ రాహుల్ గాంధీలను ఈడీలతో నోటీసులిచ్చి ఆఫీసుల చుట్టూ తిప్పుతూ కక్షపూరిత రాజకీయానికి పాల్పడుతోందని అన్నారు.2012లోనే ఆర్ఎస్ఎస్ వాది సుబ్రహ్మణ్య స్వామి కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ పత్రికకు 92 కోట్లు లోను ఇచ్చిందని ఇది నేరమని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆనాడే పరిశీలించిన ఎన్నికల కమిషన్ ఇది నేరం కాదని కేసును డిస్పోజ్ చేసిందని అన్నారు.ఆ తర్వాత ఈడికి కూడా ఫిర్యాదు చేశారు.
నాటి ఈ డైరెక్టర్ ఇందులో వాస్తవం లేదని అవినీతి లేదని తిరస్కరించి వెనక్కి పంపారని అన్నారు.కానీ మళ్లీ ఆ డైరెక్టర్ తీసేసి ఇంకో డైరెక్టర్ని పెట్టి మళ్లీ నోటీసులు ఇపిచ్చి ఇప్పుడు ఈడీ కార్యాలయాలకు పిలిపించడమంటే ఇది రాజకీయ కక్షతో సోనియా గాంధీ రాహుల్ గాంధీ బయట తిరగకూడదని ఉద్దేశంతో ఏమీ లేకపోయినా దోషిగా చిత్రీకరించాలని ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ వేస్తున్న ఎత్తుగడలని అన్నారు.
తమ సొంత ఆస్తులను దేశానికి అంకితం చేసిన వారిపై నేడు అభియోగాలు మోపడం బిజెపి నీతిమాలిన చర్య అని అన్నారు.బిజెపి ప్రభుత్వ ఉడత బెదిరింపులకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు భయపడే రకం కాదని వారికి అండగా కోట్లాది మంది కార్యకర్తలు ఉన్నారని హెచ్చరించారు.
ప్రధాని మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటం చేస్తున్న సోనియా రాహుల్ గాంధీలను రాజకీయంగా ఎదుర్కోలేక బిజెపి కేసుల పేరుతో వేధించడం సిగ్గుచేటని అన్నారు.దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి కాంగ్రెస్ సృష్టించిన జాతి సంపదను కార్పొరేట్ శక్తులైన అంబానీ అదానీ లకు దారాదత్తం చేస్తున్నారని వ్యతిరేకించిన సోనియా, రాహుల్ పై అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు.
ఇందిరా గాంధీ ని జైలు కి పంపిస్తే ఏం జరిగిందో దేశ ప్రజలకు తెలుసని ఇప్పుడు మోడీకి అదే గతి పడుతుందని స్పష్టం చేశారు.విభజన రాజకీయాలతో మతాల పేరిట కులాల పేరిట విద్వేషాలు రేపి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్న బీజేపీకి ప్రజలు త్వరలోనే గుణపాఠం చెప్పనున్నారని అన్నారు.
చింతన్ శిబిర్ లో చర్చించిన విధంగా కాశీ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని హెచ్చరించారు.మోడీ విధానాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ రాజ్ ఘాట్ వద్ద రాహుల్ గాంధీ చేపట్టిన సత్యాగ్రహ దీక్షను అడ్డుకోవడం మోడీ నియంతృత్వ పాలనకు నిదర్శనమని అన్నారు.
ప్రతిపక్షాలను నిలువరించాలని చూస్తున్న బీజేపీకి ప్రజలు త్వరలోనే గుణపాఠం చెప్తారని అన్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy