'ఈటెల ' ప్రాధాన్యానికి బీజేపీ భరోసా ! కేంద్ర బలగాలతో భద్రత ?

హుజురాబాద్ ( Huzurabad )బిజెపి ఎమ్మెల్యే, చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ ( Etela Rajender )ఢిల్లీకి వెళ్లి బిజెపి అధిష్టానం పెద్దల వద్ద ఊరట పొందినట్లుగా కనిపిస్తున్నారు.

బీఆర్ఎస్ నుంచి బిజెపిలో చేరిన తరువాత హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన రాజేందర్ కు, ఆ తర్వాత చేరికలు కమిటీ చైర్మన్ గా బిజెపి( BJP ) అధిష్టానం బాధ్యతలు అప్పగించింది.

అయినా పెద్దగా చేరికలు చోటుచేసుకోకపోవడం, గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం వంటి పరిణామాలతో, రాజేందర్ కాంగ్రెస్ లో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారనే వ్యవహారం కలకాలం రేపింది.రాజేందర్ తో పాటు, కీలక నేతలను ఢిల్లీకి పిలిపించి అధిష్టానం పెద్దలు చర్చించారు.

ఇక ఆ తరువాత ఈటెల రాజేందర్ సతీమణి ఈటెల జమున మీడియా సమావేశం నిర్వహించారు.తన భర్తను చంపేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి( Kaushik Reddy ) 20 కోట్ల సఫారీ ఇవ్వడానికి సిద్ధపడ్డారని, ఈ విషయాన్ని పార్టీ నేతలతో ఆయన చెప్పారని జమున విమర్శలు చేశారు.

దీనిపై కౌశిక్ రెడ్డి వెంటనే స్పందించారు.

Advertisement

ఈటెలను హత్య చేయించడానికి తాను ప్లాన్ చేయలేదని, హత్య రాజకీయాలు చేసేది ఈటెల రాజేందర్ అని, ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇక తరువాత ఈటెల రాజేందర్ కూడా మీడియా సమావేశం నిర్వహించి నయింకే భయపడలేదు, ఈ సైకోకు భయపడతానా అంటూ కౌశిక్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.ఇదిలా ఉంటే ఈటెల రాజేందర్ కు ప్రాణహాని ఉందని, కేంద్ర నిఘా వర్గాలు కూడా నిర్ధారించినట్లు సమాచారం.

దీంతో ఆయనకు భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.రెండు రోజుల్లో ఆయనకు కేంద్ర భద్రతా బలగాల సెక్యూరిటీని కల్పిస్తూ ఉత్తర్వులు జారీ కాబోతున్నట్లు సమాచారం.

పార్టీకి చెందిన కీలక నేతలైనా వారికి ఈ విధంగా కేంద్రం భద్రత కల్పించదు.

నిజంగానే ప్రాణహాని ఉందని నిఘా వర్గాలు తేల్చడంతోనే రాజేందర్ కు వై కేటగిరి భద్రతను కల్పించబోతున్నారట.దీంతో రాజేందర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర బిజెపి పెద్దల వద్ద తన వాయిస్ వినిపించి బాగానే ఊరట పొందినట్లుగా కనిపిస్తున్నారు.అలాగే పార్టీలో సరైన ప్రాధాన్యత కల్పిస్తామని, వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పనిచేయాలని, దీంతో పాటు బిజెపిలోకి పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహించాలని బిజెపి పెద్దలు సూచించారట.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!
Advertisement

తాజా వార్తలు