సారధి లేని బీజేపీకి వలసలు సాధ్యమా! రాజకీయలలో కొత్త సమీకరణలు

ఏపీ రాజకీయాల్లో ఇప్పటివరకు రెండు పార్టీల సంస్కృతి నడుస్తూ వస్తుంది.

గతంలో కాంగ్రెస్ టిడిపి మధ్య ప్రధాన పోటీ ఉంటే ఇప్పుడు అది కాస్త వైయస్సార్సీపి తెలుగుదేశం మధ్యకు వచ్చి చేరింది.

అలాగే తెలుగు ప్రజలు ఏదో ఒక్క పార్టీకి మాత్రమే ఎన్నికల్లో పూర్తి స్థాయి అధికారి ఇచ్చి మరో పార్టీని ఓడిస్తూ ఉంటారు.ఇప్పుడు కూడా అదే పంథాలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న టీడీపీని ఓడించి వైఎస్సార్సీపీకి పట్టం కట్టారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి.దక్షిణ భారతంలో తమ సామర్ధ్యం పెంచుకునే ప్రయత్నం చేస్తున్న బిజెపి పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కూడా పాగా వేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది.

అయితే ఏపీ రాజకీయాల్లో ఇప్పటివరకు బీజేపీకి ఒక్క సారి కూడా రెండంకెల సీట్లు కూడా తెలుగు ప్రజలు అందించలేదు.కాని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు తర్వాత బలమైన నాయకత్వం లేకపోవడం ఆ పార్టీ నేతలు కొంత కలవరపెడుతుంది.

Advertisement

ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు జాతీయ పార్టీ అయిన బిజెపి వైపు చూస్తున్నారని రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది.కానీ ఇప్పటివరకు ఏపీలో బీజేపీ పార్టీని సమర్థవంతంగా నడిపించే సారధి లేడు.

ప్రజలను తన మాటలతో ఆకర్షించే ఇమేజ్ ఉన్న నాయకుడు ఆ పార్టీలో కనిపించడం లేదు.మరి నాయకుడు లేని పార్టీలోకి నేతలు ఎంతమంది వచ్చిన కూడా ప్రయోజనం ఉండదనేది రాజకీయాలో ఇప్పటికే చాలా సందర్భాలలో రుజువైంది.

ఇలాంటి పరిస్థితుల్లో బిజెపి ఏపీలో ఏ విధంగా తన సామర్థ్యాన్ని నిరూపించుకొని భవిష్యత్ రాజకీయాల్లో స్థిరమైన స్థానం ఏర్పరుచుకుంటుంది అనేది వేచి చూడాలి.

తాజా వార్తలు