ఏపీ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో బ‌యోమెట్రిక్ హాజ‌రు

ఏపీ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులో బ‌యోమెట్రిక్ హాజ‌రు విధానం అమ‌ల్లోకి వ‌చ్చింది.

నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆస్పత్రుల్లో ఈ విధానం ప‌క్కాగా అమలు చేయాల‌ని వైద్యారోగ్య శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ ఆదేశాలు జారీ చేశారు.

అదేవిధంగా అర్హులైన ప్ర‌జ‌ల‌కు ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం అందేలా చూడాలన్నారు.ఆయుష్ డిస్పెన్స‌రీల‌ను పెంచేందుకు ప్ర‌ణాళికలు రూపొందించాల‌ని ఆదేశించారు.

అలానే ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో మందుల కొర‌త లేకుండా చ‌ర్యలు తీసుకోవాల‌ని సూచించారు.

గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?
Advertisement

తాజా వార్తలు