BB7 Arjun Aswini: బిగ్ బాస్: అర్జున్ చేసిన పనికి నొప్పితో విలవిల్లాడిన అశ్విని.. వీడియో వైరల్?

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్( Bigg Boss 7 ) గురించి మనందరికీ తెలిసిందే.

ఇప్పటికే 7 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఎనిమిదవ వారం కొనసాగుతోంది.

ఇక ఎనిమిదో వారం కూడా ముగింపు దశకు చేరుకుంది.దీంతో ఎనిమిదవ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటే అంటూ పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.

ఇకపోతే బిగ్ బాస్ కంటెస్టెంట్లకు కెప్టెన్సీ పోటీదారులు అయ్యేందుకు కంటెస్టెంట్ల‌కు ప‌లుర‌కాల టాస్క్‌లు( Captaincy Tasks ) నిర్వ‌హిస్తున్నాడు.ఇక తాజాగా జరిగిన ఈ టాస్క్ లో ప్రియాంక‌, ప‌ల్ల‌వి ప్ర‌శాంత్‌లు కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లు గెలిచారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోను విడుద‌ల చేశారు.

Advertisement

ఇందులో అర్జున్‌, సందీప్‌, బోలే, అశ్వినీ లు కెప్టెన్సీ పోటీదారులు అయ్యేందుకు పోటీ ప‌డ్డారు.స్పాంజీ హెల్మెట్‌లు ఇచ్చిన బిగ్‌బాస్ వాటిని త‌ల‌కు పెట్టుకుని స‌మ‌యానుసారంగా ష‌వ‌ర్ నుంచి వ‌చ్చే నీళ్ల‌ను స్పాంజీలో ప‌ట్టుకోవాల‌ని, త‌రువాత వాటిని బౌల్‌లో నింపాల‌ని సూచించాడు.అయితే నీళ్ల‌ను ప‌ట్టుకునే క్ర‌మంలో ఒక‌రినొక‌రు తోసుకున్నారు.

అర్జున్( Arjun ) మాత్రం ఎవ‌రు వ‌స్తే వాళ్ల‌ను రెండు చేతుల‌తో ప‌క్క‌కు తోసేశాడు.ఈ క్ర‌మంలో అశ్విని( Ashwini ) కింద‌ప‌డింది.

కాసేపు ఆమె నొప్పితో విల‌విల‌లాడిన‌ట్లు క‌నిపిస్తోంది.ప‌క్క‌నే ఉన్న శివాజీ వ‌చ్చి ఆమెను పైకి లేపారు.

టాస్క్ అనంత‌రం తేజా, అమ‌ర్‌ ల‌తో సందీప్ మాట్లాడుతూ.

మీరు 11 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

ఫిజిక‌ల్ చేయాలంటే రెండు నిమిషాలు ప‌ట్ట‌ద‌ని అన్నాడు.పీక ప‌ట్టుకుని చాలా సార్లు తోసేశాడు.ఆ పిల్ల‌ను ఒక్క తోపు తోస్తే వెళ్లిపోయింది అని తెలిపాడు తేజ.ఇక శివాజీతో అర్జున్. ఏంటీ మాఫియా మొత్తం వ్య‌తిరేకమైంది.

Advertisement

ఇంత‌క ముందు నో మాస్ట‌ర్ అనేవారు ఇప్పుడు మాస్ట‌ర్‌ మాస్ట‌ర్ అంటున్నారు అని అన్నాడు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి.

తాజా వార్తలు