Bigg Boss Divi : పెళ్లి చేసుకుందామనుకున్నాం.. అలా జరగడం వల్లే బ్రేకప్.. బిగ్ బాస్ దివి కామెంట్స్ వైరల్!

తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ప్రసారమవుతున్న బిగ్ బాస్ షో( Bigg Boss ) గురించి, షో కి ఉన్న ప్రత్యేకత గురించి మనందరికీ తెలిసిందే.

తెలుగులో ఇప్పటివరకు ఏడు సీజన్లను పూర్తి చేసుకుంది.

ఇకపోతే ఈ బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి ఎంతోమంది బాగా పాపులారిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే.మరి కొంతమంది నెగెటివిటీని మూట కట్టుకున్నారు.

బిగ్ బాస్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో దివి( Divi ) కూడా ఒకరు.బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న దివి ప్రస్తుతం వరుసగా సినిమాలలో వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె వ్యక్తిగత విషయాల గురించి కూడా స్పందించింది.తన బ్రేకప్ లవ్ స్టోరీ( Breakup Love Story ) గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది.ఈ సందర్బంగా దివి మాట్లాడుతూ.

Advertisement

బీటెక్ చదివే రోజుల్లోనే మేం ప్రేమించుకున్నాం.ఎంటెక్ వరకు ఇద్దరం రిలేషన్‌లో ఉన్నాము.

పెద్దలతో మాట్లాడిన తర్వాత పెళ్లికి కూడా అంగీకరించారు.ముహూర్తం కూడా పెట్టుకున్నాము.

కానీ ఇంతలోనే అతడి తమ్ముడి అనారోగ్య సమస్యలతో చనిపోయాడు.అయితే నా బాయ్ ఫ్రెండ్( Divi Boyfriend ) వాళ్ల తమ్ముడు నా కళ్ల ముందే చనిపోయాడు.

ఎందుకంటే అతడి చివరి రోజుల్లో నేను దగ్గరే ఉన్నాను.అలానే చనిపోయిన తర్వాత వాళ్ల ఇంటి దగ్గర చివరి కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యే వరకు నా బాయ్ ఫ్రెండ్‌కి తోడుగా ఉన్నాను.ఈ సంఘటన జరిగిన తర్వాత అతడు సొంతూరిలోనే తల్లదండ్రులకు తోడుగా ఉండిపోయాడు.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉండాల్సి రావడంతో తప్పని పరిస్థితుల్లో ఇద్దరం విడిపోవాల్సి వచ్చింది.అయితే తనతో పాటు నన్ను కూడా ఊరికి తీసుకెళ్లపోతే నా కెరీర్ నాశనమవుతుందని అనుకున్నాడు.

Advertisement

ఈ విషయం నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది.ఒకవేళ ఇది ముందే తెలుసుంటే అతడితో పాటు నేను వాళ్ల ఊరికి వెళ్లిపోయేదాన్నేమో అని దివి తన ట్రాజెడీ ప్రేమకథ గురించి బయటపెట్టింది.

తాజా వార్తలు